ETV Bharat / international

రైల్వే స్టేషన్​లో కత్తితో బీభత్సం.. ఆరుగురిపై దాడి.. నిమిషంలోనే పోలీసుల ఆపరేషన్ - పోలీసును కత్తితో పొడిచిన దుండగుడు

పారిస్​లో ఓ దుండగుడు కలకలం సృష్టించాడు. రైల్వే స్టేషన్​లోని ప్రయాణికులపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. దుండగుడిపై పోలీసులు కాల్పులు జరిపారు.

paris railway station attack
ప్రయాణికులిపై దుండగుడు దాడి
author img

By

Published : Jan 11, 2023, 4:12 PM IST

పారిస్​లో దారుణం జరిగింది. ఓ దుండగుడు గారెడు నార్డ్ రైల్వే స్టేషన్​లో ప్రయాణికులపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు తక్షణమే స్పందించి దుండగుడిపై ఛాతీపై కాల్పులు జరిపారు. దీంతో నిందితుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. గాయపడిన ప్రయాణికులను, నిందితుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం జరిగిందీ ఘటన.

క్షతగాత్రుల్లో ఒక పోలీసు అధికారి ఉన్నట్లు ఫ్రాన్స్ హోంశాఖ మంత్రి గెరాల్డ్​ డర్మానిన్ తెలిపారు. పోలీసులు తక్షణమే స్పందించి దుండగుడిపై కాల్పులు జరపకుంటే ప్రాణనష్టం జరిగేదని ఆయన అన్నారు. దుండగుడు దాడి చేసిన నిమిషం వ్యవధిలోనే అతడిపై పోలీసులు కాల్పులు జరిపారని వెల్లడించారు.

paris railway station attack
రైల్వే స్టేషన్​లో పోలీసులు

గాయపడిన వారిలో కొందరు ప్రయాణికులు, ఒక పోలీసు అధికారి ఉన్నారు. పోలీసు​ వీపు భాగంలో దుండగుడు కత్తితో పొడిచాడు. అయితే పోలీస్ బుల్లెట్​ ప్రూఫ్ జాకెట్​ ధరించడం వల్ల ప్రాణాలకు ముప్పు లేదు. దుండగుడిని నిలువరించేందుకు వెంటనే అతడిపై కాల్పులు జరిపిన పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు. క్షతగాత్రుల్లో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

--గెరాల్డ్​ డర్మానిన్, ఫ్రాన్స్​​ హోం మంత్రి

పారిస్​లో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో గారెడు నార్డ్ ఒకటి. ఇక్కడ పోలీసులు భారీ సంఖ్యలో పహారా కాస్తుంటారు. 2015 నుంచి ఇక్కడ అనేకసార్లు దుండగులు దాడులకు పాల్పడుతున్నారు.

paris railway station attack
ఘటనాస్థలిలో పోలీసులు
paris railway station attack
రైల్వే స్టేషన్​లో పోలీసులు
paris railway station attack
రైల్వే స్టేషన్​ బయట పోలీస్ వాహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.