Biden India Visit : ప్రతిష్టాత్మక జీ 20 సమావేశాలకు హాజరయ్యేందుకు భారత్‌కు పయనమయ్యారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ పర్యటనలో బైడెన్ కొవిడ్ ప్రొటోకాల్స్ అన్ని పాటిస్తారని అమెరికా అధ్యక్షుడి నివాసం శ్వేతసౌథం తెలిపింది. ఇటీవలే ఆయన భార్య కొవిడ్ బారిన పడడం వల్ల బైడెన్‌కు సైతం పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. తాజాగా భారత్ పర్యటనకు బయలుదేరేముందు కూడా బైడెన్‌కు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ రావడం వల్ల భారత్ పర్యటనకు బయలుదేరారు. తర్వాత ఆయన భార్యకు పరీక్షలు చేయగా.. నెగిటివ్‌గా వచ్చింది.
-
#WATCH | Washington DC: US President Joe Biden departs for India to attend the G20 Summit, scheduled to be held in Delhi from September 9 to 10.
— ANI (@ANI) September 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Source: Reuters) pic.twitter.com/MHCyU6ZDKI
">#WATCH | Washington DC: US President Joe Biden departs for India to attend the G20 Summit, scheduled to be held in Delhi from September 9 to 10.
— ANI (@ANI) September 7, 2023
(Source: Reuters) pic.twitter.com/MHCyU6ZDKI#WATCH | Washington DC: US President Joe Biden departs for India to attend the G20 Summit, scheduled to be held in Delhi from September 9 to 10.
— ANI (@ANI) September 7, 2023
(Source: Reuters) pic.twitter.com/MHCyU6ZDKI
మోదీతో ద్వైపాక్షిక చర్చలు
Biden G20 : మరోవైపు జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు రానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలుత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. శుద్ధ ఇంధనం, వాణిజ్యం, హైటెక్నాలజీ, రక్షణ రంగాల్లో ఇరు దేశాల బంధంపై ఇరువురు నేతలు సమీక్షంచనున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం తదితర అంశాలుపైనా చర్చించుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాల పురోగతని సమీక్షించనున్నారు. అనంతరం ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో రెండ్రోజుల పాటు జరిగే జీ20 శిఖరాగ్ర సదుస్సులో బైడెన్ పాల్గొంటారు.
స్పెయిన్ అధ్యక్షుడికి కొవిడ్.. జీ 20కి డుమ్మా
Spain President G20 : మరోవైపు స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాచెంజ్కు కొవిడ్ సోకడం వల్ల జీ 20 సమావేశాలకు ఆయన గైర్హాజరు కానున్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తమ దేశ తరఫున ఉపాధ్యక్షుడు నడియా కాల్వినో, విదేశాగం, ఆర్థిక మంత్రులు హాజరు అవుతారని తెలిపారు.
అగ్రదేశాల నాయకులు రాక
G20 Leaders Coming to India : భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం నుంచి అగ్రదేశాధినేతలు ఒక్కొకరు దిల్లీకి రానున్నారు. తొలుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారత్ చేరుకోనున్నారు. ఆయన మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు దిల్లీ విమానాశ్రయంలో దిగనున్నారు. సునాక్‌కు కేంద్ర సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే స్వాగతం పలకనున్నారు. అనంతరం ఆయన దిల్లీలోని షంగ్రి-లా హోటల్‌లో బసచేయనున్నారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రానున్నారు. సంపన్న దేశాలకు చెందిన అగ్రనాయకులు రానుండటం వల్ల దిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, సదస్సు జరిగే పరిసర ప్రాంతాలలో కౌంటర్-డ్రోన్ సిస్టమ్‌ను మోహరించారు. జీ20 కూటమిలోని సభ్జీ20 నేతల వార్తలుయదేశాలతో పాటు 11 ఆహ్వాన దేశాలు, ఐరాస, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటి అనేక అంతర్జాతీయ సంస్థల అధినేతలు కూడా సదస్సులో పాల్గొనేందుకు దిల్లీ రానున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలను పెంచడం, అంతర్జాతీయ రుణ నిర్వహణను సరళీకరించడం, క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ, గ్రీన్ డెవలప్‌మెంట్, వాతావరణ మార్పులు వంటి అంశాలే ఎజెండాగా జీ20 సదస్సు సాగనుందని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
G20 Summit 2023 Agenda India : జీ20కి సర్వం సిద్ధం.. కీలక అంశాలపై దేశాధినేతల చర్చలు.. అజెండా ఇదే..