ETV Bharat / international

కరోనాకు కళ్లెం వేసే టీకా వచ్చేస్తోంది

కరోనా మహమ్మారిని కట్టడి చేసే టీకా వచ్చేస్తోంది. ప్రయోగదశల్లో ఉన్న టీకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇందులో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ మొదటి దశ ప్రయోగాలు విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. దాని సమర్థత నిర్ధరణకు తదుపరి పరీక్షలు జరపనున్నారు. ఈ సందర్భంగా ఆక్స్​ఫర్డ్​ టీకా గురించి తెలుసుకుందాం.

author img

By

Published : Jul 21, 2020, 6:55 AM IST

UK COVID-19 vaccine
కరోనాకు కళ్లెం వేసే టీకా వచ్చేస్తోంది

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు కళ్లెం వేసే బ్రహ్మాస్త్రం సిద్ధమవుతోంది. దీన్ని రూపుమాపే టీకాలు ప్రయోగదశల్లో సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇందులో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధిచేసిన ప్రతిష్ఠాత్మక టీకా క్లినికల్‌ పరీక్షలు విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు సోమవారం ప్రకటించారు. మరోవైపు తమ టీకా వచ్చేనెలలో అందుబాటులోకి వస్తుందని రష్యా ప్రకటించింది. భారతదేశంలో అభివృద్ధిచేస్తున్న కోవాక్జిన్‌ టీకా మొదటి దశ క్లినికల్‌ పరీక్షలు దేశంలోని వివిధ చోట్ల ప్రారంభమయ్యాయి. దీంతో ఈ వైరస్‌ను తుదముట్టించే రోజులు దగ్గర పడ్డాయన్న ఆశలు చిగురిస్తున్నాయి.

ఆరంభం అదిరింది..

ఆక్స్‌ఫర్డ్‌ టీకా మొదటి దశ ప్రయోగాల కింద ఏప్రిల్‌, మే నెలల్లో బ్రిటన్‌లోని ఐదు ఆసుపత్రుల్లో 18-55 ఏళ్ల మధ్య ఉన్న 1077 మంది ఆరోగ్యవంతులకు ఇచ్చారు. దీనివల్ల వారిలో బలమైన యాంటీబాడీ, 'టి సెల్‌' రోగనిరోధక ప్రతిస్పందన కలిగినట్లు తాజాగా ప్రచురితమైన ఫలితాలు చెబుతున్నాయి. టీకా ఇచ్చాక 56 రోజుల వరకూ ఈ ప్రతిస్పందనలు కొనసాగాయి. ఈ వైరస్‌ నుంచి ఏళ్ల తరబడి రక్షణ పొందడంలో 'టి కణాలు' కీలకం. వైరస్‌ను నిర్వీర్యం చేసే యాంటీబాడీలు.. పరీక్షార్థుల్లో గుర్తించదగ్గ స్థాయిలో ఉత్పత్తయ్యాయి.

ఆక్స్‌ఫర్డ్‌ టీకా వల్ల పరీక్షార్థుల్లో బలమైన రోగ నిరోధక స్పందన ఉత్పన్నమైందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ టీకా మొదటి దశ క్లినికల్‌ ప్రయోగాల ఫలితాలను ప్రముఖ వైద్య పత్రిక 'లాన్సెట్‌' ప్రచురించింది. 'సీహెచ్‌ఏడీఓఎక్స్‌ ఎన్‌కోవ్‌-19' అనే ఈ ప్రయోగాత్మక టీకాను ఆక్స్‌ఫర్డ్‌లోని జెన్నర్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసింది. ఈ ఏడాది జనవరిలో పరిశోధనలు ప్రారంభించి, అసాధారణ వేగంతో పనిచేసింది. దీనిపై మొదటి, రెండో దశ క్లినికల్‌ ప్రయోగాలను చేపట్టింది. ఈ టీకా వల్ల అనూహ్యమైన దుష్ప్రభావాలేవీ మొదటి, రెండో దశల ప్రయోగాల్లో తలెత్తలేదని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త ఆండ్రూ పొలార్డ్‌ చెప్పారు.

" ఈ తరగతికి చెందిన ఇతర టీకాల తరహాలోనే దీని సురక్షిత స్థాయి ఉంది. ఇప్పటికే జంతువుల్లో జరిపిన ప్రయోగాల్లో.. ఇది సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ నుంచి రక్షణ కల్పిస్తుందని తేలింది. మొదటి దశ క్లినికల్‌ పరీక్షల్లోని రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందనలు వీటికి అనుగుణంగా ఉన్నాయి. అయితే మానవుల్లో దీన్ని మరింతగా నిర్ధరించడానికి మా ప్రయోగాలను ఇంకా ఉద్ధృతంగా కొనసాగించాలి. ఈ టీకా రెండు డోసును పొందిన 10 మందిలో రోగ నిరోధక ప్రతిస్పందన చాలా బలంగా ఉంది."

- ఆండ్రూ పొలార్డ్​, శాస్త్రవేత్త

ఈ ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ మానవుల్లో పూర్తి స్థాయి రక్షణ కల్పించడానికి ఇది సరిపోతుందా అన్నది ఇప్పుడే నిర్ధరించలేమని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తేల్చడానికి విస్తృత స్థాయి ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. "టీకాపై మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలను కొనసాగిస్తూనే వైరస్‌ గురించి మేం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఉదాహరణకు ఈ వైరస్‌పై పోరు సాగించడానికి ఎంత బలమైన రోగ నిరోధక ప్రతిస్పందనను మేం ప్రేరేపించాలన్నది నిర్ధరించాలి. ఈ వ్యాక్సిన్‌ సమర్థమైనదేనని రుజువైతే.. మహమ్మారిపై పోరుకు ఇది నమ్మకమైన మార్గం అవుతుంది. ఎందుకంటే ఇలాంటి టీకాలను భారీ స్థాయిలో చేయడం సులువే" అని పరిశోధనలో పాలుపంచుకున్న సారా గిల్బెర్ట్‌ పేర్కొన్నారు.

ఈ టీకా తదుపరి దశ అభివృద్ధి, భారీ స్థాయిలో ఉత్పత్తి, పంపిణీ కోసం ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ.. బ్రిటన్‌కు చెందిన బయోఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకాతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ టీకా అభివృద్ధి కొనసాగుతుండగానే దాన్ని భారీగా ఉత్పత్తి చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా సమానంగా పంపిణీ చేయడానికి ఇది మాకు భరోసాను కలిగిస్తోందని తెలిపింది.

భారత్‌లో పరీక్షల కోసం..

ఆక్స్‌ఫర్డ్‌ టీకాను భారత్‌లో పరీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేయనున్నట్లు పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) పేర్కొంది. ఈ టీకా సిద్ధమైతే, ఉత్పత్తి చేయడానికి ఎంపికైన సంస్థల్లో ఎస్‌ఐఐ కూడా ఉంది. త్వరలోనే ఈ వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తామని కూడా సంస్థ తెలిపింది.

ఆక్స్‌ఫర్డ్‌ టీకాను ఎలా అభివృద్ధి చేశారు?

కొవిడ్‌-19 వ్యాధికి కారణమయిన కొత్త కరోనా వైరస్‌ నుంచి దీన్ని అభివృద్ధి చేయలేదు. చింపాంజీల్లో సాధారణ జలుబుకు కారణమయ్యే ఒకరకమైన వైరస్‌లో జన్యుపరంగా మార్పులు చేసి దాన్ని వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఉపయోగించారు. ఇది మనుషుల్లో ఇన్ఫెక్షన్‌కు దారి తీయకుండా పెద్ద ఎత్తున మార్పులు చేశారు. అంతే కాదు.. చూడడడానికి అచ్చం కరోనా వైరస్‌లా ఉండేలా చేశారు. అంటే వ్యాక్సిన్‌లోని వైరస్‌ కణాలు కరోనా వైరస్‌లానే కనబడతాయి. దీంతో కరోనా వైరస్‌పై ఎలా దాడి చేయాలో రోగనిరోధక వ్యవస్థకు అర్థమవుతుంది.

UK COVID-19 vaccine
తొలి దశ ప్రయోగాల్లో సత్ఫలితాలు

తదుపరి కార్యాచరణ ఏమిటి?

తదుపరి (మూడో) దశలో బ్రిటన్‌లో పదివేల మందిపై ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారు. ఆ తర్వాత అమెరికాలో 30వేల మందిపై, దక్షిణాఫ్రికాలో 2వేల మందిపై, బ్రెజిల్‌లో 5వేల మందిపై ప్రయోగించాలనుకుంటున్నారు.

ఇదీ చూడండి: ఆక్స్​ఫర్డ్​ 'శుభవార్త'పై డబ్ల్యూహెచ్​ఓ ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.