ETV Bharat / international

'తైవాన్​ను చైనాలో కలిపేసుకుంటాం- అడ్డొస్తే ఊరుకోం!' - చైనా తైవాన్ జిన్​పింగ్

చైనాలో తైవాన్​ అంతర్భాగం (Taiwan Reunification) అవుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ (Jinping news) ఉద్ఘాటించారు. ఈ సమస్య చైనా అంతర్గత విషయమని, విదేశీ శక్తులు జోక్యం చేసుకునే అవసరం లేదని నొక్కి చెప్పారు. తైవాన్ స్వతంత్రతకు మద్దతు తెలిపే శక్తులకు మంచి ముగింపు ఉండదని పరోక్షంగా హెచ్చరించారు.

taiwan Xi Jinping
తైవాన్ జిన్​పింగ్
author img

By

Published : Oct 9, 2021, 1:08 PM IST

తైవాన్​ను తమ దేశంలో అంతర్భాగం (Taiwan Reunification) చేసుకునే విషయంపై చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ (Jinping news) కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ సమస్య త్వరలో పరిష్కారమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో విదేశీ జోక్యాన్ని సహించేది లేదని తేల్చిచెప్పారు.

చైనాలో నియంతృత్వానికి చరమగీతం పాడిన ఉద్యమానికి 110 ఏళ్లు నిండిన సందర్భంగా బీజింగ్​లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్స్​లో ఏర్పాటు చేసిన సభలో జిన్​పింగ్ మాట్లాడారు. తైవాన్​ను అంతర్భాగం చేసుకోవడానికి ఉన్న అతిపెద్ద అడ్డంకి ఆ దేశ స్వతంత్ర సైన్యమే అని అన్నారు.

"చైనా బలహీనత, దేశంలోని గందరగోళ పరిస్థితుల వల్ల తైవాన్ ప్రశ్న (China Taiwan conflict) ఉద్భవించింది. చైనా పునరుజ్జీవంతో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. చైనాలోని ప్రజలందరి సంకల్పం ఇదే. తైవాన్ సమస్య పూర్తిగా చైనా అంతర్గత విషయం. బయటి వ్యక్తులకు దీనిలో జోక్యం చేసుకునే అవసరం లేదు. చైనా జాతీయ పునరేకీకరణ సంకల్పం తప్పక నెరవేరుతుంది. శాంతియుతంగా ఈ ప్రక్రియ జరిగితే చైనాతో పాటు తైవాన్​కు ప్రయోజనం ఉంటుంది. తైవాన్ దేశస్థులు సరైన చరిత్రను ఎంచుకొని.. చైనా ఏకీకరణలో భాగం కావాలి. తమ మూలాలు మర్చిపోయి, స్వదేశానికి వెన్నుపోటు పొడిచి, చైనాను విడగొట్టాలనుకునే వారికి మంచి ముగింపు ఉండదు. అలాంటి శక్తులను (తైవాన్ స్వతంత్ర ఉద్యమకారులు) ప్రజలు, చరిత్ర తిరస్కరిస్తాయి."

-జిన్​పింగ్, చైనా అధ్యక్షుడు

ఈ సందర్భంగా చైనా కమ్యునిస్టు పార్టీ లేకుంటే చైనానే లేదని పేర్కొన్నారు జిన్​పింగ్. చైనాకు సీపీసీ వెన్నెముక అని చెప్పారు. చైనా విధానాలతో కూడిన సామ్యవాదమే దేశానికి సరైన దారి అని తెలిపారు. ప్రపంచ శాంతి కోసం చైనా పాటుపడుతూనే ఉంటుందని చెప్పుకొచ్చారు.

తైవాన్​ మీదకు యుద్ధవిమానాలు

ప్రస్తుతం తైవాన్, చైనా మధ్య పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా (China Taiwan tensions) ఉన్నాయి. వరుసగా నాలుగు రోజుల పాటు పదుల సంఖ్యలో యుద్ధవిమానాలను (China warplanes Taiwan) తైవాన్ గగనతలంలోకి పంపించింది చైనా. తన బలాన్ని బహిరంగంగా చాటిచెప్పేందుకు ఈ చర్యలకు పూనుకుంది. (China Taiwan fighter planes)

తైవాన్ తనను తాను సార్వభౌమాధికారం కలిగిన దేశంగా పరిగణించుకుంటుంది. చైనా మాత్రం ఈ ప్రాంతాన్ని తమ దేశం నుంచి విడిపోయిన రాష్ట్రంగా భావిస్తోంది. ఈ ప్రాంతాన్ని తమలో కలుపుకొనేందుకు సైనిక శక్తిని ఉపయోగించే అవకాశాన్నీ పరిశీలిస్తోంది చైనా.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.