ETV Bharat / international

మారుతున్న యుద్ధరీతి- పట్టణాల్లో పౌరుల గెరిల్లా పోరు! - Russia Ukraine live news

Ukraine Crisis: ఉక్రెయిన్​లో రోజులు గడుస్తున్నకొద్దీ యుద్ధ రీతులు మారిపోతున్నాయి. ఉక్రెయిన్‌ పట్టణాల్లో వీధి పోరాటాలు ప్రారంభమవుతున్నాయి. జెలెన్‌స్కీ సర్కారు తమ పౌరులకు 80 వేల తుపాకులను అందించినట్లు తెలుస్తోంది. శారీరక దృఢత్వాన్ని బట్టి 60 ఏళ్ల వయసువారు కూడా రణరంగంలో దూసుకువెళ్లాలని కోరింది. ఇందుకు యువత నుంచి భారీగానే స్పందన లభించింది. స్థానికంగా ఎవరికి వారే సొంతంగా బాంబులు తయారు చేస్తున్నారు.

Ukraine Crisis
ఉక్రెయిన్​
author img

By

Published : Feb 27, 2022, 9:28 AM IST

Ukraine Crisis: ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రకటించిన రష్యా.. మూడు రోజులుగా అక్కడి నగరాలు, పట్టణాలే లక్ష్యంగా క్షిపణులు, ఫిరంగులను ప్రయోగిస్తోంది. రష్యా సేనలు రెండు రోజుల్లోనే రాజధాని కీవ్‌ను సమీపించాయి. అయితే, రోజులు గడుస్తున్నకొద్దీ యుద్ధ రీతులు మారిపోతున్నాయి. రష్యా సేనలు పట్టణ కేంద్రాల్లోకి చొచ్చుకువచ్చి తుపాకులు ఎక్కుపెడితే.. అక్కడ జరిగేది ఆధునిక గెరిల్లా పోరాటమేనన్న విశ్లేషణలున్నాయి. పరిణామాలను చూస్తే ఇది మరెంతో దూరంలో లేదని స్పష్టమవుతోంది.

సిద్ధమవుతున్న 'పెట్రో' బాంబులు?

Russia Ukraine News: రష్యా సైనిక చర్యకు దిగిన తొలిరోజే ఉక్రెయిన్‌ ఆగ్నేయ నగరం మెలిటోపోల్‌ కుప్పకూలింది. చర్చలు, దౌత్యం, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఫలిస్తే తప్ప.. రాజధాని కీవ్‌ సహా పలు కీలక నగరాలు ఈ ముప్పును ఎదుర్కోక తప్పదు. రష్యా దూకుడు పెంచుతున్నా, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ మాత్రం పోరాటం ఆగదని, తాను తల వంచబోనని భీష్మించారు. ప్రపంచ దేశాల నుంచి సాయం అందలేదని, పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగని తాను దేశాన్ని విడిచి వెళ్లిపోనన్నారు. రష్యన్‌ సేనల ధాటికి తాము సుమారు 200 మందిని కోల్పోయామని, 1,000కి పైగా మంది గాయాలపాలయ్యారని ఉక్రెయిన్‌ ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. జెలెన్‌స్కీ మాదిరే ఉక్రెయిన్‌ యువత కూడా పోరాటమే తమకు ఊపిరి అంటోంది. రష్యా సైనికులతో తలపడేందుకు ప్రభుత్వం సుమారు 80 వేల తుపాకులు పంచిపెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు. పెట్రోలు, గ్యాస్‌, సీసాలతో సొంతంగా బాంబులను ఎలా తయారు చేసుకోవచ్చు అన్న విషయాలను ఉక్రెయిన్‌ యువత అంతర్జాలం నుంచి భారీగానే డౌన్‌లోడ్‌ చేసుకొంది. బాంబుల తయారీకి భారీగానే కసరత్తులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

కీవ్‌ ముట్టడి ఇది మొదటిసారి కాదు..

కీవ్‌ ముట్టడి ఇదే మొదటిసారి కాదు. సోవియట్‌ యూనియన్‌పై నాజీ జర్మనీ దండయాత్ర (ఆపరేషన్‌ బార్బరొసా)లో భాగంగా.. నాజీ సేనలు 1941, ఆగస్టు 7 నుంచి సెప్టెంబరు 26 వరకూ కీవ్‌ను ముట్టడించాయి. అక్కడ నక్కిన రష్యా సైనికులను చేజిక్కించుకున్నాయి. జర్మనీ దాడిలో రష్యా నాడు సుమారు 7 లక్షల మంది సైనికులను కోల్పోయింది. రష్యా సైనిక చరిత్రలో ఇది అత్యంత వినాశకర సంఘటన! ఇప్పుడు అదే రీతిలో కీవ్‌ను ముట్టడించాలని రష్యా భావిస్తుండవచ్చు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న తాపత్రయం రష్యన్‌ దళాల్లో కనిపిస్తోంది. దీన్ని పసిగట్టిన ఉక్రెయిన్‌ తన ప్రతివ్యూహానికి పదును పెట్టింది. ఆయుధాలు చేతపట్టి, రష్యా సేనలను మట్టుబెట్టేందుకు ముందుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చింది. శారీరక దృఢత్వాన్ని బట్టి 60 ఏళ్ల వయసువారు కూడా రణరంగంలో దూసుకువెళ్లాలని కోరింది. ఇందుకు యువత నుంచి భారీగానే స్పందన లభించింది. ఉక్రెయిన్‌ పౌరులు తమకు అత్యంత పరిచయమున్న వీధుల్లో.. రష్యా సేనలతో అమీతుమీ తేల్చుకునే రోజు ఎంతోదూరంలో లేదని తెలుస్తోంది. పోరాటానికి మారుపేరుగా చెప్పుకొనే ఉక్రెయిన్‌ ప్రజలపై రష్యా సైనికులు అలవోకగా పైచేయి సాధించడం సాధ్యం కాకపోవచ్చు!

ఇదీ చదవండి: యుద్ధభూమిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు.. సైనికుల్లో స్ఫూర్తి నింపుతూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.