ETV Bharat / international

Kabul Airport: కాబుల్ నుంచి ఆ మూడు చోట్లకు విమానాలు

author img

By

Published : Sep 5, 2021, 1:06 PM IST

కాబుల్ విమానాశ్రయంలో(Kabul Airport) విమానసేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ​ అరియానా అఫ్గాన్ ఎయిర్​లైన్స్​కు చెందిన విమానాలు శనివారం మూడు రాష్ట్రాలకు వెళ్లినట్లు నిర్వాహకులు తెలిపారు.

Some domestic flights resume at Kabul airport
కాబుల్ ఎయిర్​పోర్టులో ఎగిరిన విమానాలు

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Kabul Airport) దేశీయ విమాన సేవలు పునరుద్ధరించారు. అరియానా అఫ్గాన్ ఎయిర్​లైన్స్ విమానాలు మూడు రాష్ట్రాలకు వెళ్లినట్టు మేనేజర్ తెలిపారు. ఎయిర్​పోర్టులో రాడార్ వ్యవస్థ లేకుండానే ఈ విమానాలు పయనించినట్లు వెల్లడించారు. పశ్చిమ హెరాత్, దక్షిణ కాందహార్​, ఉత్తర బాల్క్​ రాష్ట్రాలకు ఇవి చేరుకున్నట్లు పేర్కొన్నారు.

అఫ్గాన్​ను తాలిబన్లు తమ వశం చేసుకున్నాక(Afghan Crisis) కాబుల్ విమానాశ్రయంలో సేవలు నిలిచిపోయాయి. కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన సాంకేతిక సాయం అందించేదుకు గతవారమే కతర్, టర్కీ టెక్నీషియన్లు కాబుల్​ వెళ్లారు. అఫ్గాన్​కు మానవతా సాయం అందించాలంటే కాబుల్ విమానాశ్రయంలో కార్యకలాపాలు పునరుద్ధరించడం అత్యంత కీలకమని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే స్పష్టం చేసింది. తాలిబన్లు(Afghan Taliban) కూడా ఎయిర్​పోర్టులో అంతర్జాతీయ విమాన సేవలు త్వరలోనే పునరుద్ధరిస్తామని ఇటీవలే చెప్పారు.

అమెరికా సైన్యాధికారి కృతజ్ఞతలు..

కాబుల్​ నుంచి అమెరికన్లను తరిలించేందుకు ప్రాణాలకు తెగించి సాయం చేసిన తమ సైనికులకు యూఎస్ ఆర్మీ జనరల్​ మార్క్ మిల్లే కృతజ్ఞతలు తెలిపారు. జర్మనీలో ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. తమ దేశ 10వ మౌంటెయిన్​ డివిజన్ సైనికుల సేవలను కొనియాడారు. కాబుల్ విమానాశ్రయంలో ఓ వైపు బాంబులు పేలుతున్నా అమెరికా సైనికులు మాత్రం యథావిధిగా సేవలు కొనసాగించారని ప్రశంసించారు.

కాబుల్​ విమానాశ్రయంలో ఆగస్టు 26న జరిగిన జంటపేలుళ్ల ఘటనలో(Kabul Airport Blast) 180మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13మంది అమెరికా సైనికులు ఉన్నారు. దీనికి ప్రతీకారంగా ఐసిస్​-కే స్థావరాలపై అమెరికా సైన్యం డ్రోన్ దాడులు నిర్వహించింది. అనంతరం ఉద్రిక్త పరిస్థితుల నడుమే తమ బలగాలు, ప్రజలను స్వదేశం తరలించింది.

ఇదీ చదవండి: Taliban Panjshir: తాలిబన్లపై షేర్​ 'పంజా'- 600 మంది హతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.