ETV Bharat / international

ఏడాది చివరిలోగా చైనా వైద్యులకు కరోనా వ్యాక్సిన్! - vaccine of corona virus

ఈ ఏడాది చివరినాటికి కరోనా వైరస్​ వ్యాక్సిన్​ను చైనా వైద్యులకు ఇవ్వనున్నట్లు తెలిపింది చైనా. నవంబర్ నెలలో మరోసారి వైరస్ విజృంభిస్తుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో మరో పోరుకు సన్నద్ధం చేసేందుకే వైద్యులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.

china vaccine
ఏడాది చివరిలోగా చైనా వైద్యులకు కరోనా వ్యాక్సిన్!
author img

By

Published : Apr 21, 2020, 2:04 PM IST

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాక్సిన్​ను 2020 చివరినాటికి చైనా వైద్యులకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది ఆ దేశం. నవంబర్​లో చలి కారణంగా వైరస్ విజృంభించే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితిలోనైనా సేవలు అందించేందుకు వారిని సన్నద్ధం చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) డైరెక్టర్ గావో పూ ప్రకటన విడుదల చేశారు.

నాటికి సిద్ధం..

వైరస్ మరోసారి విజృంభించే నాటికి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని పేర్కొన్నారు గావో. మరోసారి వ్యాప్తి మొదలయ్యే నాటికి పలువురు వైద్యులు వ్యాక్సిన్​ను తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి మెడిసిన్​, వ్యాక్సిన్​ను పరిశోధించేందుకు పరిమిత సమయం ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్​ను పరిశీలించేందుకు చైనా ఇప్పటికే ముగ్గురిని ఎంపిక చేసినట్లు చెప్పారు.

రెండో దశలో వెక్టార్ వ్యాక్సిన్​..

మిలిటరీ అకాడమీ ఆధ్వర్యంలో తయారుచేసిన అడెనో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్​ను మనుషులపై ప్రయోగించేందుకు మొదటగా అవకాశం వచ్చింది. మార్చి చివరిలో టీకాను పరిశీలించారు. రెండో దఫాలో ఏప్రిల్ 12న వ్యాక్సిన్ పరిశీలన ప్రారంభించారు.

తగ్గిన పరిశోధన కాలం..

అయితే ఏళ్లు పట్టే వ్యాక్సిన్ పరిశోధన ప్రక్రియను కొన్ని నెలలకు తగ్గించినట్లు చైనా సీడీసీ అధికారులు ప్రకటించారు. సాధారణ విధానాల ప్రకారం పరిశోధన చేస్తే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి కూడా వ్యాక్సిన్​ అందుబాటులో ఉండే అవకాశం లేదని వెల్లడించారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​లో మందు కొడుతున్నారా? అయితే ప్రమాదమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.