ETV Bharat / international

ట్రంప్​ వైపు భారతీయ- అమెరికన్ ఓటర్ల చూపు! - Trump making dent in Indian-American vote bank

భారతీయ-అమెరికన్​ ఓటర్లలో రిపబ్లికన్​ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు మద్దతు పెరుగుతున్నట్లు తాజా సర్వే చెబుతోంది. నవంబర్​ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా.. అక్కడ ఉండే మన వాళ్లు ఎటువైపు ఉన్నారనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్​-అమెరికన్ ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు ఏఏపీఐ ఈ సర్వే చేసింది.

Trump making dent in Indian-American vote bank
ఇండియన్​-అమెరికన్​ ఓటర్లలో ట్రంప్​కు పెరుగుతున్న మద్దతు
author img

By

Published : Sep 16, 2020, 6:17 PM IST

అమెరికా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో భారతీయ​-అమెరికన్​ ఓటర్లు కీలకం కాగా వారు.. వారు ఎటువైపు ఉన్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు రిపబ్లికన్​ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు భారత సంతతికి చెందిన ఓటర్ల మద్దతు అంతగా లేకపోగా.. క్రమంగా పెరుగుతున్నట్లు తాజా సర్వే చెబుతోంది. అయితే ఇప్పటికీ మెజార్టీ ఇండియన్​-అమెరికన్​ ఓటర్లు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ వైపే ఉన్నారని ​ ​ఇండియాస్పోరా, ఆసియా అమెరికన్లు- పసిఫిక్ ద్వీపవాసులు ( ఏఏపీఐ) డేటా కలిసి రూపొందించిన ఓ నివేదిక ద్వారా తెలిసింది.

మారుతున్న లెక్కలు

ప్రస్తుతం అమెరికాలో 18 లక్షల మంది భారతీయ-అమెరికన్లు ఓటు వేయడానికి అర్హులు.

భారతీయ​-అమెరిక్​ ఓటర్లను అకర్షించేందుకు, భారత్​తో బలమైన బంధాన్ని నెలకొల్పేందుకు కమలా హారిస్​ను ​ ఉపాధ్యక్ష బరిలో దింపారు బైడెన్​. దీని ద్వారా భారత సంతతి ఓటర్ల మద్దతును బైడెన్​ బాగా ఆకర్షించగలిగారని సర్వేలు చెప్పాయి.

అయితే ఏఏపీఐ చేసిన తాజా సర్వే మాత్రం గతంతో పోలిస్తే ట్రంప్​కు మన వాళ్ల మద్దతు పెరిగినట్లు తేల్చింది. 66 శాతం మంది ప్రస్తుతం బైడెన్‌కు, 28 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఉండగా, ఆరు శాతం మంది ఏ నిర్ణయాన్ని వెల్లడించలేదని చెప్పింది.

2016 అధ్యక్ష ఎన్నికల్లో 77 శాతం మంది హిల్లరీ క్లింటన్‌కు, 16 శాతం ట్రంప్‌కు ఓటు వేశారు. 2012లో భారతీయ-అమెరికన్లు 84 శాతం మంది బరాక్ ఒబామాకు ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో ట్రంప్​ దాదాపు 30శాతం మంది ఓటు వేసే అవకాశం ఉందని ఏఏపీఐ డేటా వ్యవస్థాపకుడు, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పబ్లిక్ పాలసీ అండ్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ కార్తీక్ రామకృష్ణన్ పేర్కొన్నారు.

భారతీయ-అమెరికన్ల విషయంలో డెమొక్రాట్లు జాగ్రత్తగా ఉండాలని భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి సూచించారు.

"డెమొక్రాట్లు భారతీయ-అమెరికన్ల పట్ల తగిన విధంగా ప్రవర్తించాలి. ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి."

-రాజా కృష్ణమూర్తి, అమెరికా చట్ట సభ్యుడు

ప్రముఖులు ఏమన్నారంటే..

  • అయితే ఈ సర్వే ఫలితాలను అంతగా నమ్మలేమంటున్నారు హార్వర్డ్ లా స్కూల్ లేబర్ అండ్ వర్క్‌లైఫ్ ప్రోగ్రాం డెమొక్రటిక్ నేషనల్ కమిటీ మాజీ సీఈఓ సీమా నందా.
  • భారత సంతతి ఓటర్ల ప్రాముఖ్యం భవిష్యత్​లో మరింత పెరుగుతుందన్నారు ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు ఎం.ఆర్.రంగస్వామి.
  • భారతీయ-అమెరికన్లకు దగ్గర కావడానికి ట్రంప్​ పెద్ద ప్రయత్నమే చేశారని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సౌత్ ఆసియా ప్రోగ్రాం డైరెక్టర్ మిలన్ వైష్ణవ్ అన్నారు. భారత ప్రధాని మోదీ చిత్రాన్ని ప్రచారంలో వాడుకున్నారని గుర్తుచేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.