అమెరికాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన కన్న పిల్లలనే హత్య చేసింది. అనంతరం తన భర్తనూ హత్య చేస్తానని బెదిరించింది. టెంపే ఆరిజోనాలోని ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది.
జపాన్‌కు వెళ్లేందుకు తనకు కావాల్సిన డబ్బుల విషయంలో వాగ్వాదం జరగ్గా.. ఆ మహిళ ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. మాంసం కోసే కత్తితో తన పిల్లలైన 7 ఏళ్ల బాలుడు, 9 ఏళ్ల బాలికను హత్య చేసినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితురాలు యుయి ఇనౌస్ను అరెస్టు చేసినట్లు చెప్పారు.
శనివారం ఉదయం 7 గంటలకు పోలీస్ స్టేషన్లో ఇనౌస్ లొంగిపోయారని అధికారులు చెప్పారు. తన పిల్లలను చంపాలని తనకు కొన్ని గొంతులు వినిపించాయని ఆమె చెప్పినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ప్రార్థనాస్థలంలో గ్యాలరీ కూలి ఇద్దరు మృతి