ETV Bharat / international

US Shooting: అమెరికాలో కాల్పుల కలకలం- నలుగురు మృతి - అట్లాంటాలో కాల్పులు

US Shooting: అమెరికాలోని అట్లాంటాలో మంగళవారం (స్థానిక కాలమానం ప్రకారం) కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ పోలీస్​ సహా ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. పోలీస్​ కాల్పుల్లో నిందితుడు మృతిచెందాడు.

us shooting
అమెరికాలోకాల్పులు
author img

By

Published : Dec 1, 2021, 10:57 PM IST

US Shooting: అమెరికాలో జార్జియా రాష్ట్రంలో కాల్పులు కలకలం సృష్టించాయి. అట్లాంటా పట్టణంలో మంగళవారం (స్థానిక కాలమానం ప్రకారం) ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు కూడా మృతిచెందాడు. మృతుల్లో ఓ పోలీస్​ ఆఫీసర్​ ఉండటం గమనార్హం. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.

క్లేటాన్​ కౌంటీలోని రెక్స్​ అనే ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే నిందితుడు అక్కడున్న ఓ పోలీసు ఆఫీసర్​ సహా మరో ఇద్దరు మహిళలను కాల్చి చంపాడు. ఓ 12 ఏళ్ల బాలుడిపై కాల్పులు జరిపాడు.

మృతిచెందిన అధికారి హెన్రీ లాక్సన్​గా గుర్తించారు పోలీసులు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ మరో పోలీస్​, బాలుడికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

జార్జియాలోని హెన్రీ కౌంటీలో గతనెల జరిగిన కాల్పుల్లో కూడా ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి : Bus for sleeping: హాయిగా నిద్ర పోవాలా? ఈ బస్సు ఎక్కండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.