ETV Bharat / entertainment

Vijay Antony Latest News : పెద్ద కుమార్తె లేదన్న దుఃఖాన్ని దిగమింగుకుని.. చిన్న కూతురితో కలిసి ప్రమోషన్లకు! - Vijay Antony Daughter Suicide

Vijay Antony Latest News : తమిళ యాక్టర్​ విజయ్‌ ఆంటోనీ పెద్ద కుమార్తె ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుఃఖాన్ని దిగమింగుకుని విజయ్‌ తన కొత్త సినిమా ఈవెంట్‌లో పాల్గొన్నారు.

Vijay Antony Latest News : గుండెల్లో దుఃఖాన్ని దిగమింగుకుని.. చిన్న కూతురితో కలిసి సినిమా ప్రమోషన్లకు!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 9:51 PM IST

Vijay Antony Latest News : కోలీవుడ్ స్టార్ యాక్టర్​ విజయ్ ఆంటోని జీవితంలో పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్​గా ఆయన పెద్ద కుమార్తె మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచి వేసింది. 16 ఏళ్ల వయసులోనే ఆమె ప్రాణాలను వదిలింది. అయితే ఇంతటి దు:ఖంలోనూ ఆయన తన తోటీ నటీనటులు, దర్శకనిర్మాతల కోసం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​లో పాల్గొని ఆదర్శంగా నిలిచారు.

సాధారణంగా కొంతమంది నటులు తాము నటించిన సినిమాల ప్రమోషన్స్​లోనూ పాల్గొనడానికి ఆసక్తి చూపరు. కానీ, కూతురును కోల్పోయిన పది రోజుల్లోనే.. ఆ బాధను దింగమింగుకుని మరీ.. తన సినిమా ప్రమోషన్‌లో విజయ్ పాల్గొనడం అందరినీ ఆలోచింప జేసేలా చేసింది. వ్యక్తిగత సమస్యల వల్ల సినిమాకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో విజయ్​ ఈ ఈవెంట్‌కు హాజరయ్యారని తెలిసింది.

కాగా, విజయ్‌ హీరోగా సీఎస్‌ ఆముదన్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం 'రత్తం'. ఈ సినిమా అక్టోబరు 6న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్​ చెన్నైలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్​ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విజయ్‌ ఆంటోనీ తన రెండో కూతురితో కలిసి పాల్గొన్నారు. సంబంధిత ఫొటోలు కూడా విడుదలయ్యాయి. దీంతో అభిమానులు, నెటిజన్లు.. విజయ్​ నిబద్ధత కలిగిన నటుడంటూ విజయ్‌ను ప్రశంసిస్తున్నారు. పెద్ద కుమార్తె లేదన్న బాధ నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Vijay Antony Daughter Suicide : ఇకపై ఆమె పేరుతోనే.. విజయ్‌ పెద్ద కూతురు మీరా ఆంటోని.. ఈ నెల 19న ఆత్మహత్య చేసుకున్న సంగతి ఎంతటి చర్చనీయాంశమైందో తెలిసిన విషయమే. 16 ఏళ్లకే ఆమె తనువును చాలించడం అందరినీ కలచి వేసింది. దీంతో విజయ్​.. ఇకపై తాను చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఆమె పేరుతోనే చేస్తానని తెలిపారు. ఇకపోతే 'రత్తం' సినిమా విషయానికొస్తే.. మీడియా, న్యాయవ్యవస్థల మధ్య ఉన్న బంధం ప్రజలను ఏ విధంగా ఎఫెక్ట్​ చేస్తుందనేది సినిమాలో చూపించనున్నారు. ఇందులో పరిశోధక అధికారిగా, భిన్న కోణాలున్న వ్యక్తిగా విజయ్‌ నటించారు. నందితా శ్వేత.. జర్నలిస్ట్‌గా నటించింది.

Vijay Antony Daugther Suicide : అప్పుడు తండ్రి.. ఇప్పుడు కూతురు.. సూసైడ్​పై విజయ్ ఆంటోనీ ఏమన్నారంటే..

Vijay Antony Tweet On His Daughter : 'ఇప్పటికీ నాతో 'ఆమె' మాట్లాడుతోంది'.. కూతురు మృతిపై విజయ్​ ఆంటోనీ ఎమోషనల్​ పోస్ట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.