ETV Bharat / entertainment

Samantha Myositis Treatment : ట్రీట్​మెంట్​ కోసం హీరో వద్ద రూ.25 కోట్లు!.. క్లారిటీ ఇచ్చిన సమంత.. - సమంత మయోసైటిస్​ ట్రీట్మెంట్

Samantha Myositis Treatment : మయోసైటిస్​ ట్రీట్​మెంట్​ కోసం అప్పు తీసుకున్నారంటూ తనపై వస్తున్న రూమర్స్​పై క్లారిటీ ఇచ్చారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్​ సమంత. ఇన్​స్టా వేదికగా ఈ విషయంపై స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.

Samantha Myositis Treatment
Samantha Myositis Treatment
author img

By

Published : Aug 5, 2023, 11:36 AM IST

Updated : Aug 5, 2023, 1:04 PM IST

Samantha Myositis Treatment : టాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ సమంత ఇటీవలే తనపై వచ్చిన రూమర్స్​ను తోసిపుచ్చారు. తన ట్రీట్​మెంట్​ కోసం ఆమె ఓ స్టార్ హీరో దగ్గర అప్పు తీసుకున్నానంటూ వచ్చిన వార్తలను ఖండించారు. ఇన్​స్టా వేదికగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

"మయోసైటిస్ చికిత్స కోసం రూ.25 కోట్లా!? ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇందులో నేను ఖర్చు కొంచం మాత్రమే. నా కెరీర్​లో సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేశానని నేను అనుకోవడం లేదు. నేను నా జాగ్రత్తలు చూసుకోగలను. మయోసైటిస్ అనేది ఓ సమస్య. వేలాది మంది దీనితో బాధపడుతున్నారు. చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు దయచేసి కాస్త బాధ్యతగా ఉండాలి"అని సమంత పేర్కొన్నారు.

Samantha Myositis Treatment
సమంత ఇన్​స్టా పోస్ట్​

Samantha Movies List : కాగా గత కొంత కాలంగా మయోసైటిస్​తో బాధపడుతున్న సమంత.. ఈ విషయం గురించి కొద్ది రోజుల వరకు ఎక్కడా ప్రస్తావించలేదు. ఓ వైపు చికిత్స్​ తీసుకుంటూనే మరోవైవు సినిమాలు చేస్తూ వచ్చారు. యశోద సినిమా రిలీజ్​ సమయంలో తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పి అందరిని షాక్​కు గురి చేశారు. అప్పుడు తన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఆమెకు సపోర్ట్​ ఇచ్చారు. ఇక కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత మళ్లీ 'శాకుంతలం', 'ఖుషి' లాంటి సినిమాల్లో నటించారు. హిందీలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లోనూ మెరిశారు.అయితే ఇప్పుడు ఆమె తన చికిత్స కోసం మరోసారి కాస్త విరామం తీసుకున్నారు. ఏడాది పాటు.. సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టుగా ప్రకటించారు.

Samantha Bali Trip : మరోవైపు విరామం ప్రకటించాక సమంత తొలుత 'ఇషా ఫౌండేషన్'​లో ధ్యానం చేస్తూ కనిపించారు. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి బాలీ పర్యటనకు వెళ్లారు. తన ఫ్యాన్స్​ కోసం వెకేషన్​ ఫొటోలతో పాటు వీడియోలను షేర్​ చేస్తూ నెట్టింట సందడి చేశారు. బాలీ అందాల్లో తన ఫ్రెండ్స్​తో ఎంజాయ్​ చేసిన సామ్​.. అక్కడ కొన్ని సాహాసాలు కూడా చేశారు. మైనస్ నాలుగు డిగ్రీల వద్ద ఆరు నిమిషాల పాటు గడ్డకట్టే చలిలో కూర్చుని ఐస్ బాత్​ కూడా చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Last Updated : Aug 5, 2023, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.