ETV Bharat / entertainment

ప్రాజెక్ట్​-K క్రేజ్.. ప్రభాస్​ కోసం యూఎస్​ ఫ్యాన్స్ కార్​ ర్యాలీ ​.. - us Project K car rally

Prabhas Fans Car Rally : టాలీవుడ్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్​ సంపాదించుకున్నారు రెబల్​ స్టార్ ప్రభాస్​. ఆదిపురుష్​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ప్రాజెక్ట్​-కెతో మరోసారి పలకరించనున్నారు. షూటింగ్​తో బిజీగా ఉన్న ఆయన శాన్​ డియాగో వేడుకల కోసం యూఎస్​కు పయనమయ్యారు. ఈ క్రమంలో ప్రభాస్​ యూఎస్​ ఫ్యాన్స్​ ఓ వినూత్నమైన పని చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అదేంటంటే..

project k car rally
prabhas fans car rally
author img

By

Published : Jul 18, 2023, 6:10 PM IST

Project K Car Rally : పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్​కు యూత్​లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 'బాహుబలి' ముందు ఆయన ఫాలోయింగ్​ రీజనల్​ వరకే పరిమితం ఉండగా.. ఆ ఒక్క సినిమాతో ఆయన దశనే మారిపోయింది. భారత్​లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు భారీ ఫ్యాన్​ ఫాలోయింగ్​ వచ్చేసింది. అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో జీరో హేట్రెడ్​ ఉన్న హీరోల్లో ఈయన కూడా ఒకరిగా ఉన్నారు.

ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా 'ఆదిపురుష్'​ సినిమాలో మెరిసిన ఆయన.. ఆ తర్వాత 'ప్రాజెక్ట్​-K'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లీడ్​ రోల్ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్​ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమా కంటే ముందు నుంచే మూవీ టీమ్​ ఓ వైపు షూటింగ్​తో పాటు సినిమా ప్రమోషన్ల విషయంలో జోరుగా చూపిస్తోంది.

ఇటీవలే 'ప్రాజెక్ట్-కె' టైటిల్‌ను అమెరికాలోని లోని శాన్ డియాగో కామిక్​ కాన్ అనే​ పేరిట జరిగే ఈవెంట్​లో ఆవిష్కరిస్తున్నట్లు మేకర్స్​ ప్రకటించారు. జూలై 20న జరిగే ఈ వేడుక కోసం కమల్​హాసన్, ప్రభాస్ , దీపికా పదుకొనే, డైరెక్టర్ నాగ్ అశ్విన్ అమెరికాకు హాజరవ్వనున్నారు. ఇక ప్రభాస్​ అయితే అప్పుడే యూఎస్​కు వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఓ స్వీట్​ సర్​ప్రైజ్​ను ఏర్పాటు చేశారు.

Prabhas Fans Rally : యూఎస్​ మిస్సోరిలోని సెయింట్ లూయిస్​కు చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ ఒక చోటుకు చేరుకున్నారు. ప్రాజెక్ట్ కె టీ షర్ట్స్ ధరించి రోడ్లపై భారీ కార్ ర్యాలీని నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ బ్యానర్​ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీన్ని చూసిన ఫ్యాన్స్​ సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. వీడియోను సోషల్​ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Project K Cast : 'ప్రాజెక్ట్ కె' సినిమా విషయానికి వస్తే.. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దర్శకుడు నాగ్​ అశ్విన్​ రూపొందిస్తున్న ఈ సైన్స్​ ఫిక్షన్​ మూవీలో దీపికా పదుకుణె, అమితాబ్​ బచ్చన్​, కమల్​ హాసన్, దిశా పటానీ లాంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఇప్పటికే వారికి సంబంధించిన పోస్టర్స్​ను విడుదల చేసిన మేకర్స్​.. ఈ సినిమా గురించి అభిమానుల్లో భారీ హైప్​ను క్రియేట్​ చేశారు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటు అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.