ETV Bharat / entertainment

Dasara Movie Review: నాని మాస్​ అవతారం.. 'దసరా' సినిమా ఎలా ఉందంటే? - నాని దసరా మూవీ అప్డేట్స్​

నేచురల్​ స్టార్​ నాని నటించిన లేటెస్ట్​ సినిమా 'దసరా'. ఈ చిత్రం గురువారం శ్రీరామ నవమి సందర్భంగా థియేటర్లలో విడులయ్యింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

natural star nani dasara movie review
natural star nani dasara movie review
author img

By

Published : Mar 30, 2023, 1:44 PM IST

చిత్రం: దసరా; నటీనటులు: నాని, కీర్తిసురేష్‌, దీక్షిత్‌ శెట్టి, సముద్రఖని, షైన్‌ టామ్‌ చాకో, సాయికుమార్‌, జరీనా వాహబ్‌ తదితరులు; సంగీతం: సంతోష్‌ నారాయణన్‌; సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌; ఎడిటింగ్‌: నవీన్‌ నూలి; నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి; రచన: శ్రీకాంత్‌ ఓదెల, జెల్ల శ్రీనాథ్‌, అర్జున పాతూరి, వంశీ కృష్ణ; దర్శకత్వం: శ్రీకాంత్‌ ఓదెల; విడుదల: 30-03-2023

డిఫరెంట్​ కాన్సెప్ట్స్​ ను ఎంచుకుంటూ టాలీవుడ్​లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్​ హీరో నేచురల్​ స్టార్​ నాని. క్లాస్​, మాస్​, ఫ్యామిలీ ఆడియన్స్​ ఇలా అందరికి నాని సినిమాలు బాగా నచ్చుతాయి. అందుకు తగ్గట్టుగానే నాని కథల ఎంపిక ఉంటుంది. అలా తన నేచురల్​ యాక్టింగ్​తో వెందితెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు ఈ నేచురల్​ స్టార్​.
అయితే, ఇప్పుడు శ్రీరామన వమికి 'దసరా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నాని ఊరమాస్‌ లుక్‌లో దర్శనమివ్వడంతో పాటు, అతడికి జోడీగా కీర్తి సురేశ్​ నటించడం.. టీజర్​తో పాటు ట్రైలర్​తో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను 'దసరా' అందుకుందా?. నాని ఏ మేరకు మెప్పించారు?

స్టోరీ ఏంటంటే..
తెలంగాణలోని సింగ‌రేణి ప్రాంతంలో.. 1995లో వీర్లపల్లి అనే ప్రాంతం చుట్టూ సాగే క‌థ ఇది. ధ‌ర‌ణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి), వెన్నెల (కీర్తి సురేశ్‌) ఈ ముగ్గురు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. తన స్నేహితుడు సూరి కోసం త‌న ప్రేమ‌నే త్యాగం చేసిన‌వాడు ధ‌ర‌ణి. రైళ్లలో బొగ్గు దొంగ‌త‌నం చేయ‌డం.. తాగ‌డం, స్నేహితులంతా క‌లసి తిర‌గ‌డం ఇదే వాళ్లు రోజూ చేసే పని. ఇలా సాఫీగా సాగుతున్న వారి జీవితాలను ఆ ఊరి సర్పంచ్​ ఎన్నికలు ఒక్కసారిగా కుదిపేస్తాయి. చిన్న నంబి (షైన్ టామ్ చాకో) పోటీ చేసిన ఆ ఎన్నిక‌లకు సూరితో పాటు అత‌ని స్నేహ‌బృందం.. రాజ‌న్న (సాయికుమార్‌)కి మద్దతుగా నిలిచి గెలిపించాక ఆ ఊళ్లో తీవ్ర సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటాయి. ఆ ప‌రిణామాలు ఎలాంటివి? ముగ్గురు స్నేహితుల జీవితాల్లో ఎటువంటి మార్పులు వచ్చయనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే?
స్టోరీని బట్టి మనమైన మూలాల్లోకి వెళ్లి ఆ జీవితాల్ని, క‌థ‌ల్ని నేచురల్​గా తెర‌పై కళ్లకు కట్టినట్టుగా చూపిస్తున్న ట్రెండ్ ఇది. ఇక 'ద‌స‌రా' సినిమా కూడా తెలంగాణలోని సింగ‌రేణి బొగ్గు గ‌నుల ప్రాంతంలోని వీర్లపల్లి క‌థ‌ని, అందులోని కొన్ని జీవితాలను చూపిస్తుంది. ఈ క‌థ కంటే దీని నేపథ్యమే ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచుతుంది అని చెప్పొచ్చు. కొత్త క‌థేమీ కానప్పటికీ.. ఇందులో పాత్రలతో పాటు కొన్ని విషయాలు 'రంగస్థలం' మొద‌లుకొని ఇదివ‌ర‌కు వ‌చ్చిన వివిధ సినిమాల్ని ఓ మేర తలపిస్తున్నాయి.

స్నేహం, ప్రేమ‌, త్యాగాల లాంటి మంచి భావోద్వేగాల్ని రాబ‌ట్టే ప్రయత్నం చేశారు దర్శకుడు శ్రీ కాంత్ ఓదెల. ఆ ఊరితో పాటు పెద్దల్ని, రాజ‌కీయాల్ని ప‌రిచ‌యం చేస్తూ సాగే ఆరంభ స‌న్నివేశాలు అంతగా ప్రభావం చూపించ‌క‌పోయినా... హీరో ఇంట్రడక్షన్​ నుంచే క‌థ‌లో వేగం పెరుగుతుంది. బొగ్గుని దొంగ‌త‌నం చేసే సన్నివేశాలు ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటాయి. ఆ త‌ర్వాత క్రమంగా స్నేహాన్ని, ప్రేమ‌ను ఎస్టాబ్లిష్ చేస్తూ ప‌ట్టు ప్రదర్శించారు దర్శకుడు.

ఎన్నిక‌ల్లో చిన్ననంబి పోటీ.. యువకుల మ‌ధ్య క్రికెట్ పోటీలు పెట్టడం, బార్ అకౌంటెంట్ పోస్ట్‌, వెన్నెల పెళ్లి చుట్టూ సాగే స‌న్నివేశాలకు ఆడియన్స్​ బాగా కనెక్ట్​ అవుతారు. సినిమాలో ఆ స‌న్నివేశాల‌న్నీ ఒక ఎత్తు అయితే.. ఇంటర్వెల్​కు ముందు వచ్చే సీన్స్​ మ‌రో ఎత్తు. సినిమాను మ‌రో మ‌లుపు తిప్పే ఆ ఎపిసోడ్.. ద్వితీయార్థంపై మరింత ఆస‌క్తిని పెంచుతుంది. అయితే రెండో భాగంలో ధ‌ర‌ణి, వెన్నెల పాత్రల మ‌ధ్య మ‌రింత డ్రామా, సంఘర్షణ పండించేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. ఆ స‌న్నివేశాలన్నింటిని ప్రతీకార కోణంలోనే మ‌లిచారు దర్శకుడు.

ప్రథమార్ధంపై ప్రభావం చూపించిన రాజ‌కీయ కోణం.. ద్వితీయార్ధంలో అంతగా క‌నిపించ‌దు. దాంతో క‌థ‌, క‌థ‌నాలు ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టే సాగుతాయి. ప‌తాక స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ఆ సీన్స్​లో హీరోయిజాన్ని మ‌రో స్థాయిలో చూపించారనే చెప్పాలి. ఇక చివ‌రి స‌న్నివేశమైతే సినిమాకు మ‌రింత హైలైట్​గా నిలుస్తుంది. మొత్తంగా ప‌క్కా నాటుతనంతో కూడిన తెలంగాణలోని ఓ ప‌ల్లెటూరి క‌థ ఇది.

ఎవ‌రెలా చేశారంటే?
ధ‌ర‌ణి పాత్రలో అయితే నాని ఒదిగిపోయారు. ఆయ‌న న‌ట‌నతో సినిమాను మ‌రో స్థాయిలో నిల‌బెట్టారు. మ‌న‌సులో సంఘర్షణకు గుర‌వుతూనే స్నేహానికి ప్రాణ‌మిచ్చే యువ‌కుడిగా నాని అభిన‌యం హ‌త్తుకుంటుంది. సూరి, వెన్నెలగా న‌టించిన దీక్షిత్‌, కీర్తి సురేశ్‌... ఆ పాత్రలకు న్యాయం చేశారు. ఇందులో కీర్తి సురేశ్ యాక్టింగ్​ నేచురల్​గా అనిపించింది.
'మ‌హాన‌టి' స్థాయిలో ఆమె అభిన‌యం సాగుతుంది. చిన్న నంబిగా మ‌ల‌యాళ న‌టుడు షైన్ టామ్ చాకో చూపుల‌తోనే భ‌య‌పెట్టేశారు. సముద్రఖ‌నిని కొత్త గెట‌ప్‌లో చూపించిన‌ప్పటికీ ఆయ‌న పాత్రకి ఈ సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేదు. ఊరి పెద్ద రాజన్నగా నటించిన హీరో సాయికుమార్.. ఆ పాత్రకి త‌గ్గస్థాయిలో నటించారు.

జ‌రీనా వ‌హాబ్, ఝాన్సీ త‌దిత‌రులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. వీర్లపల్లిని సత్యన్‌ సూర్యన్‌ త‌న కెమెరాతో ఓ క‌థ‌లాగే చూపించారు. సంతోష్​ నారయాణన్​ తన పాట‌లతో పాటు నేప‌థ్య సంగీతంతో ఈ సినిమాపై త‌న‌దైన ముద్రవేశారు. 'ధూమ్ ధామ్..', 'చ‌మ్కీల అంగీలేసి..' పాటలు సినిమాకు హైలైట్​గా నిలిచాయి. ఎడిటింగ్‌, ఆర్ట్ విభాగాల ప‌నితీరు సినిమాపై ప్రభావం చూపించింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల‌కి ఇదే మొదటి చిత్రమైనప్పటికీ చాలా స‌న్నివేశాల్ని అనుభ‌వ‌మున్న దర్శకుడిలా తీర్చిదిద్దారు. మాట‌లు బాగున్నాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది.

బ‌లాలు: నాని, కీర్తి సురేశ్ న‌ట‌న‌, క‌థా నేప‌థ్యం, భావోద్వేగాలు, విరామం, పతాక స‌న్నివేశాలు

బ‌లహీన‌త‌లు: ద్వితీయార్థంలో కొన్ని స‌న్నివేశాలు

చివ‌రిగా: 'ద‌స‌రా' ధూమ్ ధామ్

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.