ETV Bharat / entertainment

గుండెపోటుతో నేషనల్​ అవార్డ్​ విన్నింగ్​ సింగర్​ కన్నుమూత - నేషనల్​ అవార్డ్​ విన్నింగ్​ సింగర్​ కన్నుమూత

ప్రముఖ సింగర్, జాతీయ అవార్డు గ్రహీత శివమోగ సుబన్న(83) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

National award winning playback singer Shivamoga Subbanna passed away
గుండెపోటుతో నేషనల్​ అవార్డ్​ విన్నింగ్​ సింగర్​ కన్నుమూత
author img

By

Published : Aug 12, 2022, 9:26 AM IST

సినీఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ సింగర్​ శివమోగ సుబ్బన్న (83)కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. అలాగే సుబన్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

కన్నడలో ప్లేబ్యాక్​ సింగింగ్​లో జాతియ అవార్డు అందుకున్న తొలి గాయకుడిగా గుర్తింపు పొందారు సుబన్న. కాడు కుదురె(Kaadu kudure) చిత్రంలోనే కాడు కుదురె ఒడి బండిట్టా పాటకు ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కాగా, సుబన్న ఎక్కువగా పద్యాలను పాడుతుంటారు. కెరీర్​లో ఇంకా మరెన్నో అవార్డులను అందుకున్నారు. ఆకాశవాణి, దూరదర్శన్​లోనూ పనిచేశారు.

ఇదీ చూడండి: 'Jr.NTR కోసం హరికృష్ణ ఫోన్ చేశారు.. లేదంటే ఆ సూపర్​ హిట్​ మూవీలో వేరే హీరో!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.