ETV Bharat / entertainment

స్టేజ్​ డ్రామా వేసిన మహేశ్​ తనయుడు.. ఇంగ్లీష్​లో డైలాగ్​లు అదరగొట్టేశాడుగా! - మహేశ్ కొడుకు గౌతమ్​ న్యూస్​

సూపర్ స్టార్ మహేశ్​ బాబు-నమ్రత దంపతుల సూపర్ కిడ్​ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే తన టాలెంట్​ని బయటకి తీస్తూ తల్లిదండ్రులు మురిసిపోయేలా చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ స్టేజ్​ డ్రామాలో పాల్గొని బాగా యాక్టింగ్​ చేశాడు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Mahesha babu son Gowtham stage drama video viral
స్టేజ్​ డ్రామా వేసిన మహేశ్​ తనయుడు.. ఇంగ్లీష్​లో డైలాగ్​లు అదరగొట్టేశాడుగా!
author img

By

Published : Dec 1, 2022, 3:21 PM IST

చిత్రసీమ అంటేనే వారసత్వానికి చిరునామా. ఒకరు స్టార్‌గా నిలదొక్కుకుంటే చాలు.. వారి ఇంటి నుంచి వారసులు చాలా మంది తెరపైకి వస్తుంటారు. చివరకు ప్రతిభ ఆధారంగా సినీ రంగంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారు. అయితే అలా వచ్చే వారిలో చాలా మంది చైల్డ్​ ఆర్టిస్టులు కూడా ఉంటారు. అలాంటి వారిలో సూపర్​ స్టార్ మహేశ్ బాబు గౌతమ్​ ఒకడు. మహేశ్​ నటించిన '1' సినిమాతో అరంగేట్రం చేశాడు. చిన్నారి మహేశ్​గా మెప్పించాడు. అయితే ఆ తర్వాత తెరపై కనిపించలేదు. సోషల్​మీడియాలోనూ తక్కువగానే కనిపిస్తుంటాడు. ఎక్కువగా మాట్లాడడు. చాలా సైలెంట్​గా ఉంటాడు. కానీ మహేశ్​ బాబు తనయుడిగా గౌతమ్‌కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది.

అయితే ఇప్పటికే సూపర్​ స్టార్​ కృష్ణ నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని మరో సూపర్​స్టార్​గా ఎదిగారు మహేశ్​ బాబు. ఇప్పుడు మహేశ్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని నటుడిగా రాణించేందుకు గౌతమ్ ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా అతడికి సంబంధించిన ఓ వీడియోను మహేశ్​ భార్య నమ్రత ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. 'అతను ప్రేమలో నిపుణుడు కాదు.. కానీ అతనికి స్నేహితులు ఉన్నారు. అతడు హైస్కూల్‌లో తన మొదటి థియేటర్ ప్రొడక్షన్.. తనస్టైల్‌లో నటించేశాడు. తనకు ఫ్రోజెన్ ఫ్యామిలీ (అమెరికన్‌ ఫాంటసీ ఫిలిమ్స్‌) ఫేవరెట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..' అంటూ అమెరికన్‌ ప్లే (నాటకం) వీడియోను షేర్ చేసింది నమ్రత శిరోద్కర్.

ఈ వీడియోలో గౌతమ్​.. తన స్కూల్​లో ఓ ఇంగ్లీష్ డ్రామాలో నటిస్తూ కనిపించాడు. డిఫరెంట్​ గెటప్​లో చక్కగా ఇంగ్లీష్​ డైలాగ్​లు చెబుతూ హావాభావాలు పలికిస్తూ కనిపించాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన సూపర్​ స్టార్​ ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ అవుతున్నారు. ఆ వీడియోను మీరు చూసేయండి..

ఇక గౌతమ్​ విషయానికొస్తే.. ఈ ఏడాది అతడు పదో తరగతిని పూర్తి చేశాడు. అలాగే అతడిలో మరో ప్రతిభ కూడా ఉంది. బ‌ట‌ర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్‌, బ్రెస్ట్ స్ట్రోక్‌, ఫ్రీ స్టైల్ అనే నాలుగు ప‌ద్ధ‌తుల్లో చాల వేగంగా గౌతమ్ ఈత కొట్టగలడు. అందులో మెడల్స్​ను కూడా సంపాదించుకున్నాడు. ఇక త్వరలోనే మహేశ్-రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే భారీ ప్రాజెక్ట్​లోనూ కనిపిస్తాడని ప్రచారం సాగుతోంది. ​

కాగా, మహేశ్​ కూతురు సితార కూడా మల్టీటాలెంటెడ్​ చిన్నారి. చిచ్చుబుడ్డిలాంటి ఈ చిన్నారికి సోషల్​మీడియాలో తన అన్న గౌతమ్​ కన్నా ఎక్కువ క్రేజ్​ సంపాదించుకుంది. ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా కనిపించే ఈ బుడ్డది.. చదువుతో పాటు పాశ్చత్య, సంప్రదాయ నృత్యాల్లో శిక్షణ తీసుకుంటోంది. వాటిని ప్రదర్శిస్తూ సూపర్​ స్టార్ ఫ్యాన్స్​ను ఫిదా చేస్తోంది. ఇటీవలే సర్కారు వారి పాట సినిమాల్లో పెన్నీ సాంగ్​లో చిందులేసి ఆకట్టుకుంది.

ఇదీ చూడండి: చిరుతో పాన్ వరల్డ్​ మూవీ.. కిక్ ఇచ్చేలా బాలయ్య ఆన్సర్​.. వెంకీ​-బన్నీతో కష్టాలంటా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.