ETV Bharat / entertainment

ఎన్టీఆర్‌-ధనుష్‌-వెట్రిమారన్‌ పాన్ ఇండియా మూవీ..! తారక్ టీం క్లారిటీ - ఎన్టీఆర్‌ లేటెస్ట్ మూవీ అప్​డేట్స్​

గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్, ధనుష్​ కలయికతో తమిళ దర్శకుడుతో ఓ పాన్​ ఇండియా మూవీ తెరకెక్కబోతున్నట్లు సోషల్ ​మీడియాలో వార్తలు హచ్​చల్​ చేస్తున్నాయి. అయితే దీనిపై ఎన్టీఆర్​ టీం స్పందించి.. అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చింది.

jr ntr team resopond over vetrimaaran flim

author img

By

Published : Mar 8, 2023, 10:53 PM IST

Updated : Mar 8, 2023, 11:00 PM IST

యంగ్​ టైగర్​ ఎన్టీఆర్‌, తమిళ నటుడు ధనుష్‌తో.. తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ ఓ పాన్‌ ఇండియా మూవీని తెరకెక్కించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత రెండు రోజులుగా ఈ వార్త సోషల్‌ మీడియాలో విపరీతంగా హల్​చల్ చేస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటూ పలు వెబ్‌సైట్‌లు వెల్లడించాయి. అయితే సోషల్ ​మీడియాలో వస్తున్న ఈ తాజా వార్తలపై ఎన్టీఆర్‌ టీమ్‌ స్పందించింది. అవన్నీ ఆధారాల్లేని వార్తలని, అవాస్తవాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది.

"ఎన్టీఆర్‌, ధనుష్‌లు కలిసి వెట్రిమారన్‌లు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారని.. గత రెండు, మూడు రోజులుగా కొన్ని వార్తల తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటిలో ఏ మాత్రం నిజం లేదు. ఆ వార్తలన్నీ అవాస్తవం. దయచేసి ఆ ఊహాగానాలను నమ్మవద్దు" అని పేర్కొంది. అయితే ఇది ఓ పాన్‌ ఇండియా సినిమా అని, రెండు పార్టులుగా తెరకెక్కుతుందని కొందరు రాసుకొచ్చారు.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ సినిమాలో నటిస్తున్నారు. జాన్వీకపూర్ కథానాయిక. 'NTR30' వర్కింగ్‌ టైటిల్‌తో కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో జాన్వీకపూర్​ మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం ఆస్కార్‌ అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు ఎన్టీఆర్‌ లాస్‌ ఏంజిల్స్ వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక కొరటాల మూవీ షూటింగ్‌ పాల్గొంటారు. ఈ 'NTR30' మూవీ తర్వాత ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ఓ మూవీని చేస్తారు. ఇది ఓ పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. ప్రస్తుతం విజయ్‌ సేతుపతితో వెట్రిమారన్‌ ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత సూర్యతో 'వాడివసల్‌' అనే మూవీ చేస్తారు. అయితే ధనుష్‌ ఇటీవలే 'సార్‌'తో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో 'కెప్టెన్‌ మిల్లర్‌' మూవీ చేస్తున్నారు. ఈ మూవీ పూరైన తర్వాత శేఖర్‌ కమ్ములతో ఓ సినిమా చేయనున్నారు.

'NTR 30' స్పెషల్​ పోస్టర్​..
సోమవారం జాన్వీకపూర్​ పుట్టినరోజు సందర్భంగా.. 'NTR30' మేకర్స్ ఓ స్పెషల్​ పోస్టర్​ను విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు తనకెంతే సంతోషంగా ఉందని జాన్వీ తెలిపింది. "ఎట్టకేలకు నేను అనుకున్నది జరుగుతోంది. నేను ఎంతగానో అభిమానించే యంగ్​టైగర్​ ఎన్టీఆర్‌తో కలిసి సందడి చేసేందుకు.. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా" అని ఆమె పేర్కొంది. ఎన్టీఆర్​తో కలిసి నటించాలని ఉన్నట్లు జాన్వీ ఇదివరకే ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు.

ఇవీ చదవండి:

రామ్​చరణ్ హాలీవుడ్​ ఎంట్రీ.. త్వరలోనే సెట్స్​పైకి సినిమా!

బాలకృష్ణ న్యూలుక్స్​ అదుర్స్​.. ఫొటోస్​ వైరల్​.. 'NBK108' కోసమేనా!

Last Updated : Mar 8, 2023, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.