2024 South India Sankranthi Movies : ఇప్పటి కాలంలో సౌత్ సినిమాలకు పాన్ ఇండియాలో మంచి క్రేజ్ పెరిగిపోయింది. ప్రాంతంతో తేడా లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్ సాధిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. దీంతో మూవీ లవర్స్ కూడా పాన్ ఇండియా సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
మరోవైపు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన స్టార్స్ తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సంక్రాంతి బాక్సాఫీస్ ముందుకొచ్చారు. అలా సంక్రాంతి రేసులో ఈ సారి సౌత్ నుంచి ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో తెలుగు నుంచి నాలుగు, తమిళం నుంచి మూడు సినిమాలు ఉన్నాయి. డిఫరెంట్ జానర్స్తో భారీ అంచనాల నడుమ వచ్చిన ఆ సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. అయితే ఈ రేసులో కొన్ని బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని సంక్రాంతి విన్నర్‌గా నిలవగా, మరికొన్ని మాత్రం మిక్స్డ్ టాక్ అందుకుని సాగుతున్నాయి.
సంక్రాంతి కానుకగా తొలుత 'హనుమాన్', 'గుంటూరు కారం' సినిమాలు బాక్సాఫీస్ ముందుకు వచ్చాయి. భారీ పోటీ నడుమ ఈ రెండు సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే గుంటూరు కారం ప్రస్తుతం టాక్ పరంగా మిక్స్డ్ రిజల్ట్స్ అందుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా జోరు కొనసాగిస్తోంది. అలా ఇప్పటి వరకు 'గుంటూరు కారం' సుమారు రూ. 140 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాల మాట.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మరోవైపు పండుగ విన్నర్ 'హనుమాన్' మూవీ సూపర్ హిట్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. అటు టాక్‌తో పాటు ఇటు కలెక్షన్లు పరంగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఇప్పటి వరకు సూమారు రూ. 116 కోట్ల గ్రాస్‌ని వసూళ్లు చేసింది. ప్రస్తుతం హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సందడి చేస్తోంది. అటు నాగార్జున నా సామి రంగ కూడా మంచి టాక్ అందుకుని రన్ అవుతోంది. అయితే 'సైంధవ్' మాత్రం అటు కలెక్షన్‌తో పాటు ఇటు టాక్ పరంగా ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇక తమిళ సినిమాల విషయానికి వస్తే - అక్కడి పొంగల్ రేసులో ఈ సారి రెండు సినిమాలు పోటీపడ్డాయి. అందులో ధనుశ్ 'కెప్టెన్ మిల్లర్'తో పాటు శివ కార్తికేయన్ 'అయలాన్' ఉన్నాయి. అయితే భారీ అంచనాల నడుమ వచ్చిన 'కెప్టెన్ మిల్లర్' మాత్రం బాక్సాఫీస్ వద్ద స్లోగా నడుస్తోంది. ఇప్పటి వరకు ఈ మూవీ సుమారు రూ. 56 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది బడ్జెట్ తో పోల్చుకుంటే చాలా తక్కువ అంటూ మూవీ క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. అయితే నెమ్మదిగా ఈ మూవీ వేగం పుంజుకునే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలుగులో రిలీజ్ కాకపోవడం కూడా ఈ మూవీ కలెక్షన్స్ తక్కువగా కనిపించడానికి ఒక కారణమని అంటున్నారు.
ఇక శివ కార్తికేయన్ 'అయలాన్' సినిమా ఇప్పటి వరకు సుమారు రూ. 47.7 కోట్లు వసూళ్లు చేసింది. ఈ సినిమా అక్కడి ఆడియెన్స్‌ను ఆకట్టుకుని థియేటర్లలో మంచి టాక్‌తో నడుస్తోంది. త్వరలో తెలుగులో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ రెండు సినిమాలతో పాటు విడుదలైన విజయ్ సేతుపతి 'మెర్రీ క్రిస్మస్' మూవీ మిక్స్డ్ టాక్‌తో సరిపెట్టుకుంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">