ETV Bharat / entertainment

మల్టీకలర్‌ స్వెటర్‌లో క్యూట్​గా కత్రిన.. ధర తెలిస్తే వామ్మో అనాల్సిందే - katrina kaif latest news

ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్​మీడియాలో యూక్టివ్​గా ఉండే బాలీవుడ్​ భామ కత్రినా కైఫ్​.. ఇటీవలే షేర్​ చేసిన ఓ పోస్ట్ వైరల్​గా మారింది. ఆమె ధరించిన స్పెటర్​ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అలానే దాని ధర తెలిసి షాక్ అవుతున్నారు. ఎంతంటే.

katrina kaif
కత్రినా కైఫ్​ స్పెటర్​
author img

By

Published : Sep 6, 2022, 4:52 PM IST

బాలీవుడ్‌ సుందరి కత్రినా కైఫ్‌ మల్లీశ్వరి సినిమాతో తెలుగు వారికి దగ్గరైంది. ఆమె అందం, అభినయానికి టాలీవుడ్ ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఆ తర్వాత 2005లో బాలకృష్ణ అల్లరి పిడుగులో నటించారు. ఆపై హిందీ సినిమాలతో బిజీగా గడిపిన కత్రిన అక్కడ స్టార్ హీరోయిన్​గా ఎదిగింది. గతేడాది బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్​తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన గ్లామర్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలతో పాటు వెకేషన్‌ పిక్స్‌ను అందులో షేర్‌ చేస్తుంటుంది. అలా తాజాగా ఈ అమ్మడు చేసిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో మల్టీ కలర్‌ స్వెటర్‌తో పాటు డెనిమ్‌ జీన్స్‌లో ధరించి ఎంతో అందంగా కనిపించింది కత్రిన.

ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన కత్రిన.. మార్నింగ్ అనే క్యాప్షన్‌తో పాటు కాఫీ, ఫ్లవర్‌ ఎమోజీలను జత చేసింది. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ ఫొటోకు ఇప్పటికే విపరీతంగా లైకులు, కామెంట్లు వస్తున్నాయి. అయితే మల్లీశ్వరి ధరించిన స్వెటర్‌ నెటిజన్లను బాగా ఆకర్షించింది. కొందరు ఈ కలర్‌ఫుల్‌ స్వెటర్‌ ధరెంతో ఆరా తీయగా ఆశ్చర్యపోతున్నారు. ఈ స్వెటర్ ధర సుమారు 445 డాలర్లు ఉంటుందని తెలిసింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.35వేలు. దీంతో స్వెటర్‌ కోసం క్యాట్ అంత ఖర్చు చేసిందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇదీ చూడండి: 'ప్రాజెక్ట్​ కె' అద్భుతం​.. అక్కడ ఎన్టీఆర్​ను అలా చూసి వారంతా షాక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.