సినీఇండస్ట్రీలో హీరోల మధ్య ఉన్న స్నేహబంధం గురించి తెలిసిందే. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పలు సందర్భాల్లో కూడా ఒకరిపై మరొకరికి ఉన్న అభిమానాన్ని తెలిపారు. అయితే తాజాగా ఎన్టీఆర్-ప్రభాస్‌కు మధ్య ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పారు దర్శకుడు మెహర్ రమేష్. వారిద్దరి మధ్య ఓ ఆసక్తికర సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.
ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బిల్లా సినిమా రీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో రమేష్ మాట్లాడుతూ.. "బిల్లా సినిమాలో ఎయిర్ పోర్ట్ సీన్ షూట్ చేస్తున్నప్పుడ.. ఓ వ్యక్తి కెమెరా వైపుగా నడుచుకుంటూ వచ్చాడు. ఎవరాని చూస్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఏంటి ఇక్కడ అని అడిగితే.. షూటింగ్ చూసేందుకు వచ్చా అని అన్నాడు. అంతేకాదు షూటింగ్ తర్వాత ప్రభాస్ చేసిన వంటను తిన్నాడు. ఇక తను కూడా వంట చేసి.. మా అందరికీ తినిపించాడు. ఇలా వీరిద్దరూ ఆ రోజు చాలా ఎంజాయ్ చేశారు" అని అన్నారు.
అలాగే బిల్లా సినిమాకు కృష్ణంరాజు అనుకున్నదానికంటే ఎక్కువ సపోర్ట్ చేశారని అన్నారు రమేష్. "రెండు హెలికాప్టర్లు అడిగితే నాలుగు తెప్పిద్దాం అనేవారు. అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ కోసం కార్లు కొన్నాం. కార్లను స్మాష్ చేశాం. ఈ చిత్రంలో కృష్ణంరాజు నటించాలనే ఆలోచన ప్రభాస్‌దే. పెదనాన్న నేనూ కలిసి నటించాలనేది ఫ్యాన్స్ కోరిక డార్లింగ్ అని అన్నాడు. అలా ఆయనతో క్యారెక్టర్ చేయించాం" అంటూ చెప్పుకొచ్చారు.కాగా, 'బిల్లా' సినిమాలో అనుష్క హీరోయిన్గా నటించగా.. కృష్ణంరాజు, సుబ్బరాజు, అలీ కీలక పాత్రల్లో నటించారు. ఈ స్టైలిష్ యాక్షన్ మూవీ ఈ నెల 23న 4కె వెర్షన్లో మళ్లీ విడుదల కానుంది.
ఇదీ చూడండి: దీపిక పదుకొణె ఘనత వరల్డ్‌వైడ్ టాప్ 10 అందమైన భామల జాబితాలో చోటు