ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. ప్రస్తుతం ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తన నాటు నాటు సాంగ్ స్టెప్పులతో ప్రపంచ సినీ ప్రియుల్ని ఊర్రూతలూగించారు. ఇటీవలే ఈ పాట గ్లోబల్ అవార్డ్స్‌తో పాటు ఆస్కార్ పురస్కారానికి నామినేట్ అయిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈ ఘనతతో మంచి జోష్‌లో ఉన్న రక్షిత్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. దర్శకనిర్మాతలు, హీరోలందరూ ఆయనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా చూపుతున్నారు. ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న స్టార్ హీరోల సినిమాలన్నింటికీ పనిచేస్తున్నారు. రీసెంట్గా ఆయన నృత్యరీతులు సమకూర్చిన బాలకృష్ణ వీరసింహారెడ్డిలో 'మాస్ మొగుడొచ్చాడే' పాట, నాని 'దసరా'లోని ధూమ్ ధామ్ దోస్తాన్ పాట కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఇలా అన్ని వరసుగా సూపర్ హిట్ సాంగ్‌లకు ఆయననే కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పుష్ప 2, దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న రామ్‌చరణ్ ఆర్ సీ15, కమల్‌హాసన్ ఇండియన్ 2, మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్‌కు పనిచేస్తున్నారు. అలా ఈ అన్ని సినిమాల్లో ఒక్కో పాటకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
ఇకపోతే గతంలో ప్రేమ్ రక్షిత్.. కొరియోగ్రాఫర్ అవ్వకుముందు ప్రభుదేవా, లారెన్స్, రాజు సుందరం వంటి డ్యాన్స్ మాస్టర్స్‌కు అసిస్టెంట్‌గా ఎన్నో సినిమాలు చేశారు. అలా 2005లో రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాతో కొరియోగ్రాఫర్‌గా మారారు. ఆ తర్వాత విక్రమార్కుడు, యమదొంగ సహా పలు జక్కన్న చిత్రాలకు పని చేశారు. ఇంకా చాలా మంది దర్శకులతో పలు సూపర్ హిట్ సాంగ్‌లకు కొరియోగ్రఫీ చేశారు.
ఇదీ చూడండి: SSMB 28: త్రివిక్రమ్ ప్లాన్ ఛేంజ్.. 'కేజీయఫ్' రేంజ్లో యాక్షన్ సీక్వెన్స్ చేసి కూడా..