ETV Bharat / entertainment

గ్రాండ్​గా బిగ్​ బాస్ మానస్​ పెళ్లి వేడుక - హాజరైన ప్రముఖులు - బిగ్​ బాస్​ మానస్​ హల్దీ ఫొటోస్

Bigg Boss Manas Marriage : బుల్లితెర నటుడు, బిగ్​బాస్ ఫేమ్ మానస్ - శ్రీజ వివాహం గ్రాండ్​గా జరిగింది. విజయవాడలో ఈ జంట సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్​ అవుతోంది. వాటిని మీరూ చూసేయండి..

Bigg Boss Maanas Marriage
Bigg Boss Maanas Marriage
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2023, 11:17 AM IST

Updated : Nov 23, 2023, 1:18 PM IST

Bigg Boss Maanas Marriage : బిగ్‌బాస్‌ ఫేమ్‌ బుల్లితెర నటుడు మానస్‌ పెళ్లి వేడుకలు గ్రాండ్​గా జరిగాయి. చెన్నైకు చెందిన శ్రీజ అనే యువతితో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. విజయవాడలోని మురళీ రిసార్ట్స్‌ వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో సన్నిహితులు, కుటుంబసభ్యులు, టెలివిజన్‌, సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్ పాల్గొన్నారు. వారందరూ నూతన వధూవరులను ఆశీర్వదించి సందడి చేశారు.ఇటీవలే జరిగిన హల్డీ వేడుకలు కూడా సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూసిన ఫ్యాన్స్.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Maanas Movies And Serials List : మానస్ అసలు పేరు సాయి రోహిత్‌. చైల్డ్‌ ఆర్టిస్ట్​గా ఎన్నో సినిమాల్లో మానస్ కనిపించాడు. 'కోయిలమ్మ' అనే సీరియల్‌ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న మానస్.. బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ అయిపోయాడు. ఇక వరుస సీరియల్స్‌తో పాటు టీవీ షోస్​లో సందడి చేశాడు. 2021లో ప్రసారమైన 'బిగ్ బాస్ సీజన్ 5' కంటెస్టెంట్‌ వెళ్లిన మాసన్​.. తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆక్టటుకున్నాడు. ఫైనలిస్ట్‌గా కూడా నిలిచాడు. ఒత్తిడిలోనూ ఏమాత్రం కంట్రోల్ తప్పకుండా చక్కగా ఆడి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు.

Maanas Mansion 24 Series : బిగ్​బాస్​ తర్వాత బుల్లితెరకు పరిమితమైన ఈ స్టార్​.. పలు షో స్​ తో పాటు సినిమాల్లోనూ నటించాడు. ఇక సీరియల్స్​తో పాటు కొన్ని ప్రైవేట్‌ ఆల్బమ్స్‌లోనూ కనిపిస్తూ నెట్టింట సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఓ ప్రముఖ టీవీ ఛానెల్​లో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' అనే సీరియల్​లో నటిస్తున్నాడు. రాజు అనే క్యారెక్టర్​లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అంతే కాకుండా ఇటీవలే ప్రముఖ నిర్మాత, యాంకర్​ ఓంకార్‌ తెరకెక్కించిన 'మ్యాన్షన్‌ 24' సిరీస్​లో కనిపించాడు. వరలక్ష్మీ శరత్​ కుమార్​, అవికా గోర్, సత్య రాజ్​ లాంటి స్టార్స్​తో మానస్​ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సిరీస్​ డిస్నీ ప్లస్ హాట్​ స్టార్​ వేదికగా స్ట్రీమ్ అవుతోంది.

మానస్-విష్ణు ప్రియ 'గంగులు' ఫోక్ సాంగ్.. మాస్​ స్టెప్పులతో ఆదరగొట్టేశారుగా!

తెలుగు సీరియల్​లో షారుక్​ ఖాన్ సందడి మీరు చూశారా​

Last Updated : Nov 23, 2023, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.