ETV Bharat / entertainment

ఆ స్వామీజీ డైలాగ్ కాపీ కొట్టడం వల్లే 'ఆదిపురుష్'​కు ఇన్ని చిక్కులు! - Adipurush Troll

Adipurush movie dialogues : 'ఆదిపురుష్​'లోని హనుమాన్​ సంభాషణలపై ఇంకా ట్రోలింగ్​, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ చిత్ర డైలాగ్ రైటర్​ వీటిపై వివరణ ఇచ్చినా కూడా అవి ఆగట్లేదు. ఆ సంభాషణలన్నీ కాపీ అంటూ ఒరిజినల్​ వాటికి జత చేస్తూ వాటిని ట్రెండ్ చేస్తున్నారు. గతంలో ఓ స్వామీజి చెప్పిన సంభాషణలను ఈ చిత్రంలోని హనుమాన్​ పాత్ర కోసం ఉపయోగించారంటూ.. ఆయన వీడియోను కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఆ వివరాలు..

Etv Bharat
ఆ స్వామీజీ డైలాగ్ కాపీ కొట్టడం వల్లే ఆదిపురుష్​కు ఇన్ని చిక్కులు!
author img

By

Published : Jun 19, 2023, 4:15 PM IST

Adipurush movie dialogues : 'ఆదిపురుష్‌' రిలీజ్​ అయినప్పటి నుంచి ఆ చిత్రంలోని సంభాషణలపై సోషల్‌మీడియాలో తెగ ట్రోల్స్​ వస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది ఈ డైలాగ్స్​పై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా హనుమాన్ సంభాషణలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చాలా మాస్​గా ఉన్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే సినిమాలోని మొత్తం డైలాగ్స్​తో పాటు హనుమాన్​ సంభాషణలపై చిత్ర డైలాగ్‌ రైటర్‌ మనోజ్ ముంతాషిర్ శుక్లా స్పందించారు కూడా. ఎంతో శ్రద్ధ పెట్టి హనుమాన్‌ సంభాషణలు రాశానని చెప్పుకొచ్చారు. అయినా హనుమాన్ సంభాషణలపై విమర్శలు, ట్రోలింగ్​ మాత్రం అస్సలు ఆగట్లేదు. అలాగే చిత్రంలోని సన్నివేశాలు, పాత్రల వేషధారణలు, సినిమాలోని బ్యాక్​ గ్రౌండ్​ సెట్టింగ్స్, లొకేషన్స్​​.. అన్ని ఇతర చిత్రాల నుంచి కాపీ చేశారంటూ దర్శకుడు ఔం రౌత్​ను నెటిజన్లు ఓ ఆటాడేసుకుంటున్నారు.

Adipurush Troll : చిత్రంలోని డైలాగ్స్, సన్నివేశాలను.. ఒరిజినల్​ వాటికి జత చేస్తూ వాటిని సోషల్​మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్రంలోని హనుమాన్ పాత్ర చెప్పిన డైలాగ్స్​లో​ 'మారేగా బేటే', 'బువా కా బగీచా హై క్యా', 'జలేగి తేరా బాప్​ కీ' బాగా ట్రోల్​​ అవుతున్నాయి. అవి హిందీ వెర్షన్​లోనివి. అయితే గతంలో ఆధ్యాత్మిక గురువు హెచ్​జీ హయగ్రీవ ప్రభు చెప్పిన ఓ డైలాగ్​కు వీటిని జత చేసి పోస్ట్ చేస్తున్నారు. అందులో ఆ గురువు.. ఘీ కిస్కా? రావణ్​ కా. కప్డా కిస్కా? రావణ్​ కా. ఆగ్​ కిస్కీ? రావణ్​ కీ. జలీ కిస్కీ? రావణ్​ కీ.(నెయ్యి ఎవరిది? రావణుడిది. వస్త్రం ఎవరిది? రావణుడిది. నిప్పు ఎవరిది? రావణ్​ ది. చివరికి కాలింది ఎవరికి? రావణుడికి) అని చెబుతూ కనిపించారు. అయితే ఈ స్వామీజి చెప్పిన సంభాషణలనే.. 'ఆదిపురుష్​'లో హనుమాన్​ పాత్ర కోసం కాపీ చేశారని నెటిజన్లు ట్రోల్​ చేస్తున్నారు. 'ఆదిపురుష్​.. మొత్తం ఓ కాపీ అసైన్​ మెంట్​.', 'ఈ సంభాషణ.. గురువు వివరించే తీరు. ఇవి హనుమాన్ చెప్పినవి కావు. కానీ ఇప్పుడు హనుమాన్​ నోటి నుంచి ఈ సంభాషణలు రావడానికి ఆ రైటరే కారణం. ఇలా చేయడం కరెక్ట్ కాదు', 'ఇలా కాపీ చేయడం వల్లే సినిమాకు ఇన్ని చిక్కులు' అని యూజర్స్ కామెంట్స్​ చేస్తున్నారు.

Adipurush Dialogue writer : అంతకుముందు డైలాగ్స్​ గురించి రైటర్​ మాట్లాడుతూ.. "హనుమాన్‌ సంభాషణలను నేను తప్పుగా రాయలేదు. బాగా ఆలోచించాకే ఈ సంభాషణలను రాశాను. సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. అందరూ ఒకేలా మాట్లాడ లేరు కదా. అందుకే పాత్రల మధ్య వ్యత్యాసం చూపించడానికి ఈ డైలాగ్స్‌ను ఇలా సరళీకరించాను" అని అన్నారు. వచ్చే వారంలోగా డైలాగ్స్​లో మార్పులు చేస్తానని చెప్పారు.

  • #Adipurush the creators have copied so much
    Lanka looks like Asgard palace from Marvel
    The initial fight location is same as the one in the jungle book movie
    The actors walk like they're in a Marvel Movie
    Vanar sena looks inspired by Kong#AdipurushDisaster
    Pictures from web pic.twitter.com/L7Lk6zFL1h

    — Dolly Dwivedi (@dolly2190) June 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మార్వల్​ సినిమాటిక్​ యూవినర్స్​లోని సీన్స్​.. 'ఆదిపురుష్​'లోని కొన్ని సన్నివేశాలు మార్వల్​ సినిమాటిక్​ యూనివర్స్​లోని థోర్​ సినిమాలోలా ఉన్నాయని అంటున్నారు. రావణుడి లంక.. అస్గార్డ్​ ప్యాలేస్​లా ఉందని చెబుతున్నారు. రావణుడు నడిచే తీరు.. మార్వల్​లోని ఓ పాత్రలా ఉందంటూ.. అలాగే సినిమా ప్రారంభంలో ఫైటింగ్​ జరిగే ప్రాంతం.. జంగిల్​ బుక్​లోని లొకేషన్స్​లా​ ఉన్నాయని, ఇంకా వానర సేనను చూపించే విధానం.. 'కాంగ్​' సినిమా నుంచి కాపీ చేసి తీశారంటూ విమర్శిస్తున్నారు.

  • Asgard vs Lanka

    Actually have put really hard effort to change colour. And this must have cost them 600 cr for sure. pic.twitter.com/yYhceeIKaW

    — Karan (@singhkaran29) June 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • The makers of Adipurush are so lazy and miser that they made Lanka look black coloured hell instead of golden to save on VFX resources. Instead of recreating pushpak viman, they used Unreal Engine default objects like Games of Throne look-alike dragon and Asgard from Thor pic.twitter.com/EoBhsedbAa

    — Zee (@MhaskarChief) June 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి :

'ఆదిపురుష్' @340 కోట్లు.. రాముడిగా ప్రభాస్​ను అందుకే సెలెక్ట్​ చేశారా?

'ఆదిపురుష్‌' ఎఫెక్ట్​.. అక్కడ భారత్​ సినిమాలపై నిషేధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.