Samantha Emotional Post : మయోసైటిస్ అనే ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. అనారోగ్యంగా ఉన్నప్పటికీ యశోదా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. సెలైన్ పెట్టుకుని మరీ డబ్బింగ్ చెప్పారు. స్ట్రాంగ్ ఉమెన్‌గా పేరు తెచ్చుకున్న సామ్.. ఇన్‌స్టాలో పోస్ట్‌లు పెడుతూ అభిమానులకు ధైర్యం చెబుతుంటారు. ఈ క్రమంలో సామ్ పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతోంది.
"చాలా నెర్వస్‌గా ఉంది కానీ ఎక్సయిట్ అవుతున్నా! ఇంకా ఒక్కరోజే ఉంది. మీ అందరికి యశోద నచ్చాలని గట్టిగా కోరుకుంటున్నా. మీ తీర్పు కోసం నాలాగే నా దర్శకులు, నిర్మాతలు, సినిమా యూనిట్ మొత్తం వెయిట్ చేస్తోంది" అంటూ తన లేటెస్ట్ ఫోటోని షేర్ చేశారు. ఆ ఫొటోలో సామ్ తనలా లేదని పూర్తిగా మారిపోయిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తను త్వరగా కోలుకుని ఎప్పటిలానే సినిమాలు చేయాలని ప్రార్థనలు చేస్తున్నారు.
Samantha Yashoda Movie : శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన చిత్రం 'యశోద'. ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. మణిశర్మ మ్యూజికల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో శుక్రవారం విడుదల కానుంది..
ఇదీ చదవండి:'సమంత ఇచ్చిన ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను'
కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ మరో సంచలన చిత్రం.. 'ది వ్యాక్సిన్ వార్'