- మానవ అభివృద్ధి సూచికలో మనం ఎక్కడ ఉన్నామో ఆలోచించుకోవాలి
- వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాల్లో ఎంత అభివృద్ధి ఉందో చూడాలి
- దళారీ వ్యవస్థ, అవినీతి అంతకంటే వేగంగా బలపడింది
- అవినీతిని రూపుమాపేలా చర్యలు తీసుకుంటున్నాం
- గ్రామాన్ని మార్చేందుకు గ్రామసచివాలయాలు తీసుకొచ్చాం
- రైతులు, పేదలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని కృషిచేస్తున్నాం
- విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అడిగితే విద్యుత్ సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి
- పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కచ్చితంగా స్థానికులకే ఇవ్వాలని చెప్పాం
- సామాజిక న్యాయ చరిత్రలోనే లేనివిధంగా బడుగులు, బలహీనవర్గాలు, మహిళలకు పెద్దపీట వేశాం
- బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం మనదని గట్టిగా చెబుతున్నాం
- బీసీ కులాలు అంటే భారతీయ సంస్కృతి, నాగరికతలకు బ్యాక్ బోన్ క్లాసులుగా చూస్తామని చెప్పాం
- రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేశాం
- భారతదేశ రాజకీయ చరిత్రను మలుపు తిప్పేలా సామాజిక న్యాయానికి చట్టాలు తీసుకొచ్చాం
- బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నామినేటెడ్ పదవులకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేశాం
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేశాం
- అధికారంలోకి వచ్చిన కేవలం రెండు నెలల్లోనే చేశానని గర్వంగా చెబుతున్నా
- ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లోనూ గతంలో లేనివిధంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేశాం
- పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించేలా చట్టం చేశాం
- పరిశ్రమలకు దరఖాస్తు చేస్తున్నప్పుడే స్థానికులకు శిక్షణ ఇచ్చి వెన్నుదన్నుగా నిలబడాలని నిర్ణయించాం-
- భూ యజమాని హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా కౌలు రైతులకు వైఎస్‌ఆర్ రైతు భరోసా
- రైతు భరోసాతో పాటు ఉచితంగా పంటల బీమా కల్పించాం
- కార్పొరేట్ సంస్కృతిని మార్చేందుకు పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చేశాం
- పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచిన ప్రభుత్వం మనదని చెప్పడానికి గర్వపడుతున్నా