ETV Bharat / crime

జగన్ ప్రోత్సాహంతోనే తిక్కారెడ్డిపై హత్యాయత్నం.. తీవ్రంగా స్పందించిన చంద్రబాబు - కర్నూలు జిల్లాలో వైసీపీ దాడులు

YCP attack on tdp leader: కర్నూలు జిల్లాలో వైకాపా నేతలు.. మంత్రాలయం తెదేపా బాధ్యుడు తిక్కారెడ్డిపై దాడికి యత్నించారు. ఈ ఘటనలో ఆరుగురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ దాడిని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. దాడి జరుగుతుంటే.. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ycp attack
రెచ్చిపోయిన వైకాపా నేతలు
author img

By

Published : Dec 11, 2021, 7:44 PM IST

Updated : Dec 11, 2021, 10:27 PM IST

YCP attack on tdp leader: కర్నూలు జిల్లాలో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. తెదేపా కార్యకర్తలే లక్ష్యంగా దాడికి దిగారు. మంత్రాలయం తెదేపా బాధ్యుడు తిక్కారెడ్డిపై దాడికి యత్నించారు. ఈ ఘర్షణలో ఆరుగురు తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు.

రథోత్సవంలో పాల్గొన్న తిక్కారెడ్డిపై దాడికి వైకాపా వర్గీయుల యత్నం

రథోత్సవంలో విచక్షణారహితంగా దాడి..
Attack on thikka reddy: జిల్లాలోని కోసిగి మండలం పెద్దభూంపల్లిలో జరుగుతున్న ఆంజనేయస్వామి రథోత్సవంలో తిక్కారెడ్డి పాల్గొన్నారు. ఇదే అదునుగా భావించిన వైకాపా అల్లరి మూకలు దాడులకు తెగబడ్డారు. కర్రలతో ఒక్కసారిగా వైకాపా నాయకులు విరుచుపడ్డారు. వెంటనే తేరుకున్న తెదేపా కార్యకర్తలు తిక్కారెడ్డిని కాపాడారు. ఈ ఘటనలో ఐదుగురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇద్దరిని చికిత్స కోసం ఆదోని ఆసుపత్రికి తరలించారు. బాధితులను మంత్రాలయం తెదేపా బాధ్యుడు తిక్కారెడ్డితో పాటు ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, తెెదేపా నాయకులు పరామర్శించారు.

కాగా.. చికిత్స కోసం వెళ్తున్న నలుగురిని పోలీసులు అడ్డుకున్నారని, ఆదోనికి రాకుండా నిలువరించారని బాధితుడు నరసప్ప చెప్పారు. తమ ప్రాణాలకు ఎటువంటి హాని జరిగినా ముఖ్యమంత్రి జగన్​దే బాధ్యత అని తిక్కారెడ్డి అన్నారు.

పోలీసులు ఏం చేస్తున్నారు?: చంద్రబాబు
తిక్కారెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేస్తుంటే పోలీసులేం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు కాపాడలేకపోతే.. డీజీపీ రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తమ పార్టీ కార్యకర్తలు తిరగబడితే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. జగన్ రెడ్డి ప్రోద్భలంతోనే తిక్కారెడ్డిపై వైకాపా మూకల హత్యాయత్నం చేశాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటి వరకు రెండుసార్లు హత్యాయత్నం జరిగినా.. ఎందుకు రక్షణ కల్పించలేదని నిలదీశారు. పట్టపగలు దాడులుచేస్తుంటే పోలీసులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. తమ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. దేవుడి సన్నిధిలో కూడా వైకాపా నేతల హత్యారాజకీయాలు చేశారని మండిపడ్డారు. దాడులు చేస్తున్న వైకాపా మూకలు.. మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ప్రజలే తిరగబడి వైకాపా నేతలకు బుద్దిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న బాబు.. దాడులకు పాల్పడిన వారిని తక్షణం అరెస్ట్ చేసి, తిక్కారెడ్డికి రక్షణ కల్పించాలని కోరారు.

వైకాపా అరాచకానికి నిదర్శనం: అచ్చెన్నాయుడు
Achennayudu respond On attack: మంత్రాలయం తెదేపా నేత తిక్కారెడ్డిపై హత్యాయత్నం వైకాపా అల్లరి మూకల బరితెగింపునకు నిదర్శనమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అమ్మవారి జాతరకు వెళ్తే హత్యాయత్నం చేస్తారా? అని నిలదీశారు. వరుసగా రెండుసార్లు హత్యాయత్నం జరిగినా భద్రత కల్పించకపోవడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.

TDP leader thikka reddy: తిక్కారెడ్డి ప్రాణాలకు ఎటువంటి హాని జరిగినా ముఖ్యమంత్రి జగన్​దే బాధ్యతని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ రాకతోనే రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోసుకున్నాయన్నారు. అరాచక దాడులతో తమ నిజస్వరూపాన్ని చాటుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలతో ఎంతోకాలం పాలన సాగించలేరని ముఖ్యమంత్రి జగన్​ గ్రహించాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే వైకాపా అరాచకాలను అడ్డుకుంటామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: నారా లోకేశ్
Nara lokesh on attack: మంత్రాలయం తెదేపా నేత తిక్కారెడ్డిపై హత్యాయత్నాన్ని నారా లోకేశ్ ఖండించారు. తిక్కారెడ్డిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తిక్కారెడ్డిపై గతంలో హత్యాయత్నం జరిగినా భద్రత కల్పించలేదని లోకేశ్‌ విమర్శించారు. వైకాపా అరాచక పాలనకు ఈ దాడులే నిదర్శనమన్నారు.

Last Updated : Dec 11, 2021, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.