ETV Bharat / crime

ఫొటోలు మార్ఫింగ్​​ చేస్తామని బెదిరింపులు.. మహిళ ఆత్మహత్య

Loan Apps Suicides: రాష్ట్రంలో లోన్​ యాప్​ నిర్వాహకుల ఆగడాలు మళ్లీ మొదలయ్యాయి. బాధితుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. వారి ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని.. అప్పిచ్చిన రుణ యాప్​లు.. వాటిని వసూలు చేసేందుకు బ్లాక్​మెయిలింగ్​లకు పాల్పడుతున్నాయి. బాధితుల కాంటాక్ట్​ లిస్ట్​ను యాక్సెస్​ చేసుకునే వెసులుబాటు ఉండటంతో.. వాటి ద్వారా బెదిరింపులకు దిగుతున్నాయి. అప్పు చెల్లించకపోతే.. ఫొటోలు మార్ఫింగ్​ చేసి బంధుమిత్రులకు పంపుతామని బెదిరించడంతో.. వేరే దారిలేక బలవన్మరణం చెందుతున్నారు. తాజాగా రుణ యాప్​ వేధింపులకు మరో మహిళ బలైంది.

1
1
author img

By

Published : May 19, 2022, 3:47 PM IST

Loan Apps Suicides: 'నువ్వు చచ్చినా సరే.. మా దగ్గర తీసుకున్న అప్పు చెల్లించాల్సిందే.. లేదంటే నీ ఫొటోలన్నీ మార్ఫ్​ చేసి వేరే వ్యక్తితో నీకు వివాహేతర సంబంధం ఉన్నట్లు నీ ఫోన్​లోని కాంటాక్ట్​ నెంబర్లకు పంపిస్తా'నంటూ తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఓ మహిళను వేధించి.. చివరకు ఆమె ఉసురు తీసుకున్నారు దా'రుణా'ల యాప్​ నిర్వాహకులు. లోన్​ యాప్​లో రుణం తీసుకుని గడువు దాటినా చెల్లించకపోవడంతో.. నిర్వాహకులు యథావిధిగా తమ అసలు స్వరూపం బయటపెట్టారు. బాకీ వసూలు చేసుకునేందుకు ఆమెను నిరంతరం వేధించారు. వారి వేధింపులు తాళలేక ఓ సారి ఆత్మహత్యాయత్నం చేసిన ఆమె.. ప్రాణాల నుంచి బయటపడినా వారు కనికరించలేదు. బెదిరింపులు ఎక్కువ కావడంతో ఈ సారి ఏకంగా మృత్యు ఒడికే చేరింది.

రుణ యాప్​ల వేధింపులు తట్టుకోలేక మంచిర్యాల జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లా కేంద్రంలోని గోపాల్​వాడకు చెందిన బొల్లు కల్యాణి (30).. భర్త సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​. కరోనా సమయంలో భర్త ఉద్యోగం పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమయంలో లోన్​ యాప్​ల ద్వారా రుణాలు పొందవచ్చని తెలుసుకున్న గృహిణి.. పలు దఫాలుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి 7 లోన్ యాప్​లు ఇన్​స్టాల్​ చేసుకుని రుణాలు పొందింది. గడువు దాటినా చెల్లించకపోవడంతో.. ఓ యాప్​ నిర్వాహకులు ఆమెకు పదేపదే ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. సమయం కావాలని అడిగినా వారు కనికరించలేదు.

లోన్​ యాప్​ నిర్వాహకుల ఆగడాలు
లోన్​ యాప్​ నిర్వాహకుల ఆగడాలు

దీంతో ఆమెను అవమానించడం మొదలుపెట్టారు. ఫొటోలు మార్ఫింగ్​ చేసి.. ఆమె ఫోన్​లోని కాంటాక్ట్​ నెంబర్లకు పంపిస్తామని బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన కల్యాణి.. ఓ సారి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించడంతో బతికి బయటపడింది. అయినప్పటికీ లోన్​ యాప్​ల నిర్వాహకుల వేధింపులు ఆగలేదు. ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితురాలు తెలిపినా.. అవన్నీ తమకు అవసరం లేదని.. అప్పు తీర్చాల్సిందేనని.. లేదంటే అసభ్యకర ఫొటోలను కాంటాక్ట్​ నెంబర్లకు షేర్ చేస్తామని చెప్పడంతో గత్యంతరం లేని బాధితురాలు చివరకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.