ETV Bharat / crime

ఓ తాగుబోతుని ఏం చేయలేని నువ్వు దేనికి.. ప్రియుడిని రెచ్చగొట్టిన మహిళ.. ఆ తర్వాత.. - విజయనగరం జిల్లా తాజా వార్తలు

MURDER: అతను ఓ ఆటో నడుపుకుంటూ వచ్చిన డబ్బుతో మద్యం తాగేవాడు. డబ్బులు సరిపోకపోతే భార్యను అడిగేవాడు. అయితే అతడి భార్య ఓ ఫార్మా కంపెనీ క్యాంటీన్‌లో హెల్పర్‌గా పని చేస్తోంది. అదే కంపెనీలో సూపర్‌వైజర్‌గా చేస్తున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇంట్లో ఘర్షణ జరిగింది. అడ్డు తొలగించుకునేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ దశలోనే ప్రియుడితో వాగ్వాదానికి దిగింది. ఓ తాగుబోతుని చంపలేని నువ్వు దేనికి పనికొస్తావంటూ రెచ్చగొట్టింది. దీంతో ఆగ్రహించిన ఆయన మరొకరి సాయంతో ఆ తాగుబోతుని పథకం ప్రకారం హత్య చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. చనిపోయిన వ్యక్తి కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా మృతుడి భార్య పదే పదే దర్యాప్తు ఆపేయాలని కోరింది. దీంతో తీగ లాగితే.. డొంక కదిలినట్లు మొత్తం వ్యవహారం బయటికి వచ్చింది.

wife murder husband with the help of her lover
ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిన భార్య
author img

By

Published : May 1, 2022, 11:14 AM IST

Updated : May 1, 2022, 11:42 AM IST

MURDER: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. అయితే ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే దర్యాప్తు ఆపేయాలని మృతుడి భార్య పదే పదే కోరడంతో అనుమానం వచ్చిన పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెతో పాటు పలువురిని విచారించగా భర్తను చంపింది తామేనని వారు అంగీకరించారు.

"డెంకాడ మండలం డి.బాడువకు చెందిన డి.రామకృష్ణ (51) ఆటో నడుపుతూ వచ్చిన సొమ్మును మద్యం తాగేందుకు ఖర్చు చేసేవాడు. డబ్బులు లేకపోతే భార్య లక్ష్మిని అడిగేవాడు. ఆమె పైడిభీమవరంలోని ఫార్మా కంపెనీ క్యాంటీన్‌లో హెల్పర్‌గా పని చేస్తోంది. అదే కంపెనీలో సూపర్‌వైజర్‌గా చేస్తున్న పెద్ద తాడివాడకు చెందిన బి.దశకంఠేశ్వరరావుతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నారు. లక్ష్మి అవసరాలకు ఆయనే డబ్బులు సమకూర్చేవారు. ఏడాది కిందట ఈ విషయం రామకృష్ణకు తెలియడంతో ఇంట్లో ఘర్షణ జరిగింది. ఆయన అడ్డు తొలగించుకునేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. నిరాశ చెందిన లక్ష్మి.. దశకంఠేశ్వరరావుతో వాగ్వాదానికి దిగింది. ఓ తాగుబోతుని చంపలేని నువ్వు దేనికి పనికొస్తావంటూ రెచ్చగొట్టింది. దీంతో ఆయన అదే కంపెనీలో పనిచేస్తున్న పూసపాటిరేగ మండలానికి చెందిన జి.శంకరరావు సహాయంతో ప్రణాళిక రచించారు. వంతెన పైనుంచి తోసేయాలని.. గత నెల 2న పేరాపురం సమీపంలో ఆటో నడుపుతున్న రామకృష్ణకు ఫోన్‌ చేసి మద్యం తాగేందుకు దశకంఠేశ్వరరావు పిలిచారు. రాత్రి 8 గంటల సమయంలో పిట్టపేట వైపు ఆటోలో వెళ్లి మద్యం తాగి తిరిగి పయనమయ్యారు. అనంతరం రామకృష్ణతో శంకరరావు గొడవకు దిగి ఆటోలో నుంచి తోసేశాడు. రోడ్డుపై పడిన రామకృష్ణ తలకు తీవ్రగాయమవ్వడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందాడు" అని అదనపు ఎస్పీ అనిల్‌కుమార్‌ వెల్లడించారు.

మృతదేహాన్ని సీహెచ్‌ అగ్రహారం వద్ద పొలాల్లో పూడ్చాలనుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆటోలో మృతదేహాన్ని పెట్టుకుని నాతవలస వంతెన పైనుంచి కిందకు తోసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ద్విచక్రవాహనం రావడంతో రోడ్డుపైనే ఆటోను తిరగేసి పరారయ్యారు. అనంతరం రామకృష్ణ కుమార్తె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రక్రియను ఆపేయాలని లక్ష్మి పదేపదే పోలీసులను ఆశ్రయించడంతో అనుమానం వచ్చిన ఎస్‌ఐ జయంతి వారిని విచారించడంతో చంపింది తామేనని అంగీకరించారు. కేసును ఛేదించిన ఎస్‌ఐ ఆర్‌.జయంతి, కానిస్టేబుల్‌ దామోదరరావు, సిబ్బందిని అదనపు ఎస్పీ పి.అనిల్‌కుమార్‌ అభినందించారు.

ఇదీ చదవండి: Rape at Repalle: రేపల్లెలో దారుణం.. భర్తను కొట్టి భార్యపై సామూహిక అత్యాచారం

Last Updated : May 1, 2022, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.