ETV Bharat / crime

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను కాదని.. మరో ప్రియుడి కోసం - ప్రియుడిపై మోజుతో భర్తను కడతేర్చిన భార్య

Wife Killed Husband with Lover Support: ఆమెకు పెళ్లైంది.. నలుగురు పిల్లలు ఉన్నారు.. అయినా సరే మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఇంకేముంది ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్న విషయాన్ని కూడా మరిచిపోయి.. అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ప్లాన్​ వేసింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసి.. బస్తాలో మూట కట్టి చెరువులో పడేసింది. నాలుగు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. స్థానికులిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్​ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

wife killed husband
husband murder
author img

By

Published : Nov 20, 2022, 10:42 PM IST

Wife Killed Husband with Lover Support: ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తనే హత్య చేసిందో భార్య. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య.. మృతదేహాన్ని గోనె సంచిలో మూట కట్టి కాలువలో పడేసింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెం గ్రామం దగ్గర నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న మణి, శోభ అనే దంపతులు పంటపాళెం గ్రామంలో నివాసముంటున్నారు. రొయ్యల గుంట వద్ద కాపలాగా ఉంటూ జీవనం సాగిస్తున్న వీరికి నలుగురు పిల్లలున్నారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో.. భరత్ అనే వ్యక్తి ప్రవేశించాడు. శోభ, భరత్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడటంతో.. కాపురంలో కలతలు మొదలయ్యాయి. ప్రియుడు భరత్​పై మోజు పెంచుకున్న శోభ.. భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. నాలుగు రోజుల క్రితం ప్రియుడు భరత్, మరో ముగ్గురు వ్యక్తుల సాయంతో గ్రామ సమీపంలోని నక్కల కాలువ వద్ద మణిని గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని గోతం సంచిలో మూటగట్టి నీటి ప్రవాహం అధికంగా ఉండే నక్కల కాలువలో పడేశారు. కాలువలో గోతాం సంచిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోగి దిగిన పోలీసులు గోతామును బయటకు తీసి మణి మృతదేహంగా గుర్తించారు. పోలీసులు ప్రాథమిక విచారణలో ఈ హత్య చేసింది భార్య శోభనేనని నిర్ధారించి, వారిని అదుపులోకి తీసుకున్నారు.

భర్త మణిని చంపేసిన భార్య శోభ
భర్త మణిని చంపేసిన భార్య శోభ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.