రాష్ట్రంలో అనేక చోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాల బాగోతం వెలుగు చూస్తోంది. తాజాగా విజయనగరం జిల్లా గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.35 లక్షల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో నలుగురు దస్తావేజు లేఖరు కాగా.. మరో ఇద్దరు సహాయ డాక్యుమెంటరీ రైటర్, కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు.
కంప్యూటర్ ఆపరేటర్ సహాయంతో పీడీఎఫ్ ఎడిటర్ విధానంలో రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీ చలానాలను మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని బొబ్బిలి డీఎస్పీ మోహన్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ అన్నారు. గతంలో చలానాలు బ్యాంకుల్లో తీసేవారని.. కరోనా నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు, రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు..., వారి బ్యాంకు కార్డులు ఉపయోగించి చలానాలు తీసుకునే విధానం ఏర్పాటు చేసినందున.. దస్తావేజు లేఖర్లు అక్రమాలకు తెరతీసినట్లు విచారణలో తేలిందన్నారు.
ఇదీ చదవండి: FAKE CHALLAN : నకిలీ చలానాల కుంభకోణం... విస్తుపోయే నిజాలు