ETV Bharat / crime

Accident: గుర్తు తెలియని వాహనం ఢీకొని మతిస్థిమితం లేని వ్యక్తి మృతి - తూర్పు గోదావరి జిల్లా వార్తలు

రోడ్డుపై పడుకున్న మతి స్థిమితం లేని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడిక్కక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ప్రధాన కూడలిలో జరిగింది.

man died
మతిస్థిమితం లేని వ్యక్తి మృతి
author img

By

Published : Jul 6, 2021, 5:55 AM IST

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ప్రధాన కూడలిలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో యాకుబ్ ఆలీ(50) అనే మతిస్థిమితం లేని వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అర్ధరాత్రి రోడ్డుపై పడుకుని ఉండగా వాహనం ఢీకొని వెళ్లిపోవడంతో మృతి చెందాడని ఎస్సై గోపాలకృష్ణ తెలిపారు. అతణ్ని ఢీకొట్టిన వాహనం వైజాగ్​కు చెందినదిగా గుర్తించామని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

అంతర్వేది రథం కేసులో అనుమానితుడిగా..

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైన సంఘటనలో యాకుబ్​ అలీని అనుమానితుడిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి కావడం, అతనికి భాష అర్థం కాకపోవడంతో అతడికి విశాఖపట్నంలో వైద్యం చేయించి అనంతరం విచారణ చేపట్టారు. అప్పటికి పిచ్చివాడిగా ప్రవర్తించడం, భాష అర్థంగాక స్థానిక పోలీస్ స్టేషన్​లో కొద్దిరోజులు ఉంచి వదిలేశారు. మృతుడు అప్పటినుంచి పోలీస్ స్టేషన్ చుట్టుపక్కలే ఉంటూ అటూఇటూ తిరుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి రోడ్డుపై పడుకుని ఉండగా వాహనం ఢీకొని వెళ్లిపోవడంతో మృతి చెందాడు.

ఇదీ చదవండి:

Fake diamond: నకిలీ వజ్రం తాకట్టు... రూ.58 లక్షలకు టోకరా

దుండగుల దాడిలో.. వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.