ETV Bharat / crime

Crime News: క్రికెట్ బుకీల వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్యాయత్నం.. - ఏపీ క్రైమ్ న్యూస్

Today Crime News: రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రమాదాలు, ఇతర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పదిహేను మంది మృతి చెందారు. పల్నాడు, సత్యసాయి, కడప జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు.

నేర వార్తలు
author img

By

Published : Apr 5, 2022, 12:06 PM IST

Updated : Apr 6, 2022, 4:35 AM IST

ప్రమాదవశాత్తు చెరువులో పడి... ఇద్దరు మృతి: నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. మర్రిగుంట చెరువు అలుగులో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు మృతి చెందారు. చెరువు అలుగులో దుస్తులు ఉతుకుతుండగా హనుమ(25), ప్రవీణ్‌(10) అనే ఇద్దరు జారి పడినట్లు స్థానికులు తెలిపారు.

Out Sourcing Electrician Died with Current Shock: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు విద్యుత్ ఉపకేంద్రం వద్ద విద్యుదాఘాతంతో అవుట్​ సోర్సింగ్​ ఎలక్ట్రిషియన్ మృతిచెందాడు. మైలా రత్నబాబు(25).. పసుమర్రు పంచాయతీలో అవుట్ సోర్సింగ్ ఎలక్ట్రిషియన్​గా పనిచేస్తున్నాడు. గ్రామంలో విద్యుత్​దీపాల మరమ్మతుల నిమిత్తం సహాయ లైన్​మెన్ రాములు నాయక్.. రత్నబాబును తీసుకెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్ కేంద్రం వద్ద జంపర్ మారుస్తుండగా కరెంట్​ షాక్​కు గురైన రత్నబాబు.. స్తంభం పైనుంచి కిందపడి దుర్మరణం చెందాడు. సహాయక లైన్​మెన్​ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. అతన్ని కఠిన శిక్షించాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పోర్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ ఎస్సై రాజేష్ తెలిపారు.

తల్లి మందలించిదని బాలిక ఆత్మహత్య: పాఠశాలకు వెళ్లడం లేదని తల్లి మందలించిందని మనస్థాపానికి గురైన 10 ఏళ్ల బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప ఎర్రముక్కపల్లిలో చోటు చేసుకుంది. కడప ఎర్రముక్కపల్లికు చెందిన శివమ్మ, మల్లికార్జున్​కు ముగ్గురు సంతానం. వారిలో జ్యోతి చివరి అమ్మాయి.. స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. గత పది రోజుల నుంచి జ్యోతి పాఠశాలకు వెళ్లడం లేదు. పాఠశాలకు ఎందుకు వెళ్లడం లేదని తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు శవమై కనిపించడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

బీబీనగర్​లో హిజ్రా దారుణ హత్య: పల్నాడు జిల్లా సత్తెనపల్లి బీబీనగర్ ప్రాంతంలో హిజ్రా దారుణహత్యకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు తలపై రాళ్లతో కొట్టి హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు.

నసనకోటలో యువకుడి దారుణ హత్య: శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోటలో యువకుడు హత్యకు గురయ్యాడు. శిరీష్‌ అనే యువకుడిని చేతులు, కాళ్లు కట్టేసి దుండగులు కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు.

ఒంటిమిట్టలో యువకుడి దారుణ హత్య: కడప జిల్లా ఒంటిమిట్ట చెరువు కట్ట వద్ద కూలీని దుండగులు దారుణంగా హత్య చేశారు. రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అద్దంకి బ్రాంచ్ కాలవలో గుర్తుతెలియని మృతదేహం: బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం అడవిపాలెం సమీపంలోని హైడల్ పవర్ ప్రాజెక్టు లాకుల వద్ద అద్దంకి బ్రాంచ్ కాలవలో ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని అద్దంకి సీఐ రాజేష్ పరిశీలించారు. రెండు రోజుల క్రితం మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతదేహంపై గాయాలను బట్టి హత్యకు గురయ్యాడని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరిలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అశ్లీల నృత్యాలు చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు అరెస్టు: అశ్లీల నృత్యాలు చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను చల్లపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం రాముడుపాలెం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అశ్లీల నృత్యాలకు ఏర్పాట్లు చేస్తున్నారనే సమాచారంతో నిర్వాహకులను అరెస్టు చేశారు. ఎవరైనా ఇలాంటి అశ్లీల నృత్యాలు చేయడానికి ప్రయత్నించినా, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించినా వారిపై చట్ట ప్రకారం.. చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఆస్తి గొడవలతో... తండ్రిపై కత్తితో దాడి: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం నాయునిపల్లిలో నాయునిపల్లి గ్రామానికి చెందిన వర్నవరపు వీరాస్వామి(84) వృద్ధుడిపై కొడుకు కత్తితో దాడి చేశాడు. వృద్ధుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన కొడుకు వెంకటస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి గొడవల నేపథ్యంలో దాడికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వంశదార కాలువలో పడి వ్యక్తి మృతి: శ్రీకాకుళం జిల్లా హిరమండలం వంశధార జలాశయం కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. పెండ్ర కృష్ణ(35) అనే కూలి మధ్యాహ్నం పనులు ముగించుకుని చేతులు కాళ్లు శుభ్రం చేసుకునేందుకు జలాశయం లింక్ కెనాల్ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి కెనాల్​లో పడిపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో కొట్టుకుపోయాడని.. రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తోటి స్నేహితులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

2,250 కేజీలు గంజాయి స్వాధీనం: విశాఖ జిల్లా ఆనందపురం మండలం నీళ్లకుండీల జంక్షన్ వద్ద ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మినీ వ్యాన్ బోల్తా పడింది. అందులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి బస్తాలు బయటపడ్డాయి. ప్రమాదం జరిగిందని ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు... గంజాయి బస్తాలు చూసి నివ్వెరపోయారు. మినీ వ్యాన్‌లో 57 బస్తాల్లో దాదాపు 2వేల 250 కేజీలు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

పిఠాపురంలో భారీగా ఖైనీ ప్యాకెట్లు సీజ్: కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం రాజుగారి కోటకు సమీపంలో లారీలో నుంచి టాటా ఏస్ వ్యాన్​లోకి మారుస్తున్న ఖైనీ ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. నలుగురిని అరెస్టు చేశారు. వీటి విలువ రూ.23 లక్షల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు. కోల్​కత నుంచి పిఠాపురం తెస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

పంటపొలాల్లో నాలుగేళ్ల బాలుడి మృతదేహం.. ఆ బాలుడేనా..? నంద్యాల జిల్లా నంద్యాల మండలం కానాల- పాండురంగాపురం గ్రామాల మధ్య పొలాల్లో నాలుగేళ్ల వయసు గల బాలుడి మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు పంట పొలాల్లో మృతదేహాన్ని కాల్చి వేసినట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అయితే మార్చి 31న నంద్యాల మండలం బాపూజినగర్ చెందిన నాలుగేళ్ల బాలుడు అదృశ్యమైనట్లు.. అతని తల్లి మాధవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం లభించిన మృతదేహం ఆ బాలుడిదేనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరమ్మతులు చేస్తూ... విద్యుత్ షాక్​తో లైన్​మెన్ మృతి: కర్నూలు జిల్లా ఆదోనిలో విద్యుత్ శాఖ లైన్​మెన్ విద్యుత్ షాక్​తో మృతి చెందారు. పట్టణంలోని కంచి గారి వీధిలోని ఒక ఇంటిలో కరెంటు లేదని ఫిర్యాదు రావడంతో మరమ్మతుల కోసం వెళ్లిన మధుసూదన్ రావు.. స్తంభం ఎక్కి రిపేరు చేసే సమయంలో షాక్ కొట్టి పైనుంచి కింద పడ్డాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా... మార్గమధ్యలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

వివాహిత హత్య కేసును ఛేదించిన పోలీసులు: అనంతపురం జిల్లా గుంతకల్లులోని అరవిందనగర్​లో జరిగిన వివాహిత హత్యకేసును ఒకటవ పట్టణ పోలీసులు ఛేదించారు. అదనపు వరకట్న కోసం భార్యను చిత్రహింసలు గురి చేసి చంపాడన్న కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగం లోకి దిగిన పోలీసులు, నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి హైదరాబాద్​లో అదుపులోకి తీసుకుని వారిని రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

నలుగురు నకిలీ రిపోర్టర్ల అరెస్ట్: ఏలూరు జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలో పెద్ద చెరువులో నుంచి మట్టి తోలుతున్న వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన నలుగురు నకిలీ రిపోర్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు నకిలీ విలేకరులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారు ఉపయోగించిన కారును సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు లేదు సీఐ అంకబాబు వెల్లడించారు

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి: ఎన్టీయార్ జిల్లా మైలవరం మండలంలోని పోరాట నగర్​లో అజ్మీరా శిరీష (28) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. భర్త అజ్మీరా స్వామిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు: కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం పాత ఇంజవరం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌, బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో మణికుమార్‌ అనే వ్యక్తి మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

ఇష్టం లేని వివాహం చేస్తున్నారని యువతి ఆత్మహత్య: బంధువులు తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్న కారణంతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం కాటేవారిపల్లెలో జరిగింది. బాధితురాలిని మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స చేస్తుండగా మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈతకు వెళ్లి బావిలో బాలుడు గల్లంతు: శ్రీ సత్య సాయి జిల్లా కనగానపల్లి మండలం ముక్తాపురం వద్ద ఈతకు వెళ్లిన నందమోహన్ రెడ్డి అనే 12 ఏళ్ల బాలుడు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు నీటిలో మునిగిపోవడంతో తోటి మిత్రులు గ్రామస్థులకు తెలిపారు. బాలుడి ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

అనారోగ్యం తాళలేక వృద్ధురాలు ఆత్మహత్య:పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యాన్ని తాళలేక హుస్సేన్ బీ (55) అనే ఓ వృద్ధురాలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందింది.

క్రేన్ మీద పడి వ్యక్తి మృతి: కాకినాడలోని డీప్‌వాటర్ పోర్టులో ప్రమాదం జరిగింది. క్రేన్ మీద పడి శ్రీవల్లి షిప్పింగ్ కంపెనీ సూపర్‌వైజర్ ప్రసాద్ మృతి చెందారు.

క్రికెట్ బుకీల వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్యాయత్నం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో క్రికెట్ బుకీల వేధింపులు తాళలేక దుర్గాప్రసాద్ అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. బుకీలకు రూ.లక్షా 80 వేలు కట్టలేక పురుగుల మందు తాగాడు. యువకుడిని తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అన్నను నరికి చంపిన తమ్ముడు: విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. బొబ్బిలి మండలం దొంగురువలసలో అన్న నారాయణరావును గొడ్డలితో నరికి చంపాడు తమ్ముడు శామ్యూల్. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్తి వివాదాలో హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామన్నారు.

ఇదీ చదవండి: Radisson Blu Pub: రాడిసన్ బ్లూ పబ్‌ లైసెన్స్ రద్దు

Last Updated : Apr 6, 2022, 4:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.