ETV Bharat / crime

TODAY CRIME NEWS: వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి

author img

By

Published : Mar 4, 2022, 12:38 PM IST

Updated : Mar 4, 2022, 9:13 PM IST

AP Crime News: రాష్ట్రంలో పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కడప జిల్లాలో గ్యాస్ రీ ఫిల్లింగ్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విజయవాడలో ద్విచక్రవాహనం సృష్టించిన బీభత్సంలో ఓ మహిళ మృతి చెందింది.

TODAY CRIME NEWS
నేటి నేర వార్తలు

TODAY CRIME NEWS in AP: రాష్ట్రంలో పలుచోట్ల ప్రమాదాలు వెలుగుచూశాయి.వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఆరుగురు మరణించారు.

గ్యాస్ రీఫిల్లింగ్ దుకాణంలో అగ్నిప్రమాదం...
కడప చిన్న చౌక్ పరిధిలోని నెహ్రూ నగర్ వద్ద రాత్రి అనధికారికంగా గ్యాస్ రీఫిల్లింగ్​ చేస్తున్న దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో దుకాణ నిర్వాహకుడు కాళ్ళకు తీవ్రగాయాలయ్యాయి. మహేష్ అనే వ్యక్తి అనధికారికంగా గ్యాస్ సిలిండర్లకు గ్యాస్ రీఫిలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో మంటలు అంటుకోవడంతో దుకాణం మొత్తం మంటలు వ్యాపించాయి. మహేష్ భయంతో పరుగులు తీశారు. అప్పటికే అతని కాళ్ళకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో చుట్టుపక్కలవారు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే దుకాణంలో పలు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇలా అనధికారికంగా గ్యాస్ రీఫిలింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నా... పోలీసులు గాని, రెవెన్యూ అధికారులు గాని చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు.

ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొన్న లారీ..యువకుడు మృతి...
ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం తిమ్మన పాలెం జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి లారీ బలంగా ఢీట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న మేదరమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడు తమ్మవరం గ్రామానికి చెందిన బట్టు శ్రీకాంత్ గా గుర్తించారు. మృతుడు తమ్మవరం నుంచి గ్రోత్ సెంటర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్థరించారు.ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్..వాహనాన్ని వదిలి పెట్టి పరారయ్యాడు.

భక్తులపై దూసుకెళ్లిన బైక్...మహిళ మృతి...
విజయవాడ నగర శివారు కొత్తూరు తాడేపల్లి వద్ద ద్విచక్రవాహనం బీభత్సం సృష్టించింది. కాలినడకన దుర్గగుడికి వెళుతున్న భక్తులపైకి వాహనం దూసుకెళ్లడంతో ఓ మహిళ మృతి చెందింది. మరొకరికి గాయాలయ్యాయి. ద్విచక్రవాహన దారుడు మద్యం మత్తులో వాహనం నడుపుతున్నాడని స్థానికులు చెపుతున్నారు. మృతురాలు మైలవరం మండలం బొర్రగూడెం గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు.

భార్య పై భర్త హత్యాయత్నం...
అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని ఉయ్యాలకుంట కాలనీలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య వీరనారమ్మను భర్త రమణ అతి కిరాతకంగా పొడిచాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన మహిళను తమ వాహనంలోనే ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చిన్నారి మృతదేహం లభ్యం
ప్రకాశం జిల్లా గుంటుపల్లిలో అప్పుల బాధతో ఇద్దరు చిన్నారులతో సహా తండ్రి అద్దంకి బ్రాంచ్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో... నేడు చిన్నారి నేడు చిన్నారి చైతన్య కృష్ణ (9) మృతదేహం మార్టూరు మండలం ఇసుక దర్శి సమీపంలోని అద్దంకి బ్రాంచ్ కాలవలో లభ్యమైంది. నిన్నటి వరకు తండ్రి చిరంజీవి(36), చిన్నారి సాయి సౌమ్య(8) మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మేనల్లుడు మృతి
ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మేనల్లుడు లోకేశ్‌ మృతి చెందాడు. కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎమ్మెల్యే మేనల్లుడు మరణించాడు. ఈనెల ఒకటో తేదీన ఐ.పోలవరం మండలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఎమ్మెల్యే కుమారుడు సుమంత్ కోలుకుంటుండగా.. లోకేశ్ తుది శ్వాస విడిచాడు.

వ్యాపారి మోసం
ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో వ్యాపారి మోసం కలకలం రేపింది. 69 మంది రైతులు నుంచి ధాన్యం కోలుగోలు చేసి రూ.1.4కోట్ల ఎగ్గొట్టి పరారయ్యాడు. మోసపోయిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనిశా వలలో అవినీతి అధికారి
అ.ని.శా. వలలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఏపీఈపీడీసీఎల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ చిక్కారు. రైతు నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏఈ కూచిపూడి శ్రీనివాస్​ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. చేపల చెరువుకు కమర్షియల్‌ సర్వీసు ఇవ్వడానికి లంచం డిమాండ్‌ చేయగా.. రైతు నాగరాజు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు.

ఇద్దరు మహిళలు మృతి..
పోలవరం కుడి కాలువలో పడి అక్కాచెల్లి మృతి చెందారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం మామిడిగొందికి చెందిన నాగలక్ష్మి(35), రాములమ్మ (26)గా గుర్తించారు. మృతదేహాలను పోలవరం ఆస్పత్రికి తరలించారు.

దారుణ హత్య
విజయవాడ సింగ్‌నగర్ పరిధి అయోధ్యనగర్‌లో దారుణ హత్య జరిగింది. అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు.

దొంగల ముఠా అరెస్టు
రాత్రి సమయాల్లో ఇంటి ఆరు బయట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను అనంతపురం జిల్లా గుంతకల్లు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7.50 లక్షలు విలువ చేసే 14 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి.. రిమాండ్​కు తరలించినట్లు గుంతకల్లు డీఎస్పీ నరసింగప్ప వెల్లడించారు

వ్యక్తి అపహరణ..
ప్రకాశం జిల్లా కొండపి మండలం ఉప్పలపాడులో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బస్సు డ్రైవర్ లక్ష్మయ్య(24)ను అతడి సోదరుడి ప్రేమ వివాహం దృష్ట్యా అపహరించినట్లు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం లక్ష్మయ్య అపహరణపై కొండపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మయ్య ఒంగోలు ఆస్పత్రిలో ఉన్నాడని .. టంగుటూరు రైల్వేట్రాక్‌పై పడి ఉన్నట్లు మరోసారి దుండగులు ఫోన్ చేశారు. ఘటనాస్థలాలకు వెళ్లిన పోలీసులు.. తప్పుడు సమాచారంగా నిర్ధారణకు వచ్చారు.

ఇదీ చదవండి : Road Accident: వేర్వేరు చోట్ల ప్రమాదాలు...గాయపడ్డ 14మంది ప్రయాణికులు

Last Updated : Mar 4, 2022, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.