ETV Bharat / crime

AP Crime News: కత్తితో భార్య గొంతు కోసి.. పోలీస్​స్టేషన్​లో లొంగిపోయాడు - ఏపీ తాజా నేర వార్తలు

AP Crime News: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రమాదాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో ఒకరు మృతి చెందారు. కడప జిల్లా ఒంటిమిట్టలో వివాహిత దారుణ హత్యకు గురైంది. అనంతపురం జిల్లా మొరంపల్లి క్రాస్ వద్ద జాతీయ రహదారిపై రూ.9 లక్షల విలువైన కర్ణాటక మద్యాన్ని పోలీసులు సీజ్​ చేశారు.

ap crime news
ఏపీ నేర వార్తలు
author img

By

Published : Apr 1, 2022, 5:09 PM IST

Updated : Apr 1, 2022, 10:12 PM IST

Today AP Crime News: చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను తూర్పుగోదావరి జిల్లా మలికీపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త: కడప జిల్లా ఒంటిమిట్టలో వివాహితను భర్త కత్తితో గొంతు కోసి హత్య చేశారు. ఏడేళ్ల కిందట రేష్మా, ఇస్మాయిల్​ అనే ఇద్దరికి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబ కలహాలతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. పుట్టింట్లో ఉన్న రేష్మా ఇంటికి వెళ్లి ఇస్మాయిల్ ఆమెతో గొడవపడి వెంట తెచ్చుకున్న టువంటి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు ఇస్మాయిల్ ఒంటిమిట్ట పోలీస్​స్టేషన్​లో లొంగిపోయాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రూ.9 లక్షల విలువైన కర్ణాటక మద్యం సీజ్​: అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం మొరంపల్లి క్రాస్ వద్ద జాతీయ రహదారిపై రూ.9 లక్షల విలువైన కర్ణాటక మద్యాన్ని పోలీసులు సీజ్​ చేశారు. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి నుంచి కర్నూలు జిల్లాకు అక్రమ తరలిస్తున్న మద్యాన్ని ముందస్తు సమాచారం మేరకు హిందూపురం రూరల్​ పోలీసులు తనిఖీలు చేపట్టారు. చిలమత్తూరు మండలం జాతీయ రహదారిపై కొడికొండ చెక్​పోస్టు మొరంపల్లి క్రాస్ వద్ద ఐచర్ వాహనం, కారుల్లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటకకు చెందిన 170 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు సెబ్ అడిషనల్ ఎస్పీ రామ్మోహన్ మీడియాకు వివరించారు.

చోరీలకు పాల్పడుతున్న.. ఇద్దురు దొంగలు అరెస్ట్​: పట్టపగలు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.6.25 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. మలికిపురం పీఎస్ పరిధిలోని దిండిలో గతనెలలో జరిగిన చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారామపురానికి చెందిన ఇద్దరు నిందితులు పత్తిరి ప్రసాద్, పత్తిరి ఇశ్రాయేలును దిండి చెక్​పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారించగా పాలకొల్లు, నరసాపురం పీఎస్​ల పరిధిలో మరో రెండు చోరీలు చేసినట్లు తెలింది. ఈ చోరీలకు సంబంధించి 91 గ్రాములు బంగారు ఆభరణాలు, 11 వందల గ్రాములు వెండి ఆభరణాలు, రూ.90 వేలు నగదు, బైకు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు మీడియాకు పోలీసులు వెల్లడించారు.

డ్వాక్రా మహిళల సొమ్ము హాం ఫట్: డ్వాక్రా మహిళలు బ్యాంకులో జమ చేయాలని డబ్బులు ఇస్తే.. వాటని సొంత ఖాతాలోకి మళ్లించిందో యానిమేటర్. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కైకలూరు మండలం పల్లివాడ గ్రామంలో ఆరు డ్వాక్రా గ్రూపుల మహిళలను విజయలక్ష్మి అనే యానిమేటర్ మోసగించింది. ఈ గ్రూపుల్లోని మహిళలకు చెందిన దాదాపు రూ.10 లక్షలను విజయలక్ష్మి కాజేసిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో నగదు జమ చేయకుండా సొంత ఖాతాలోకి మళ్లించుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

పట్టపగలే చోరీ : కడప జిల్లా ప్రొద్దుటూరు గరుడాద్రి నగర్‌లో పట్టపగలే ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడిన దుండగులు.. బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారని బాధితులు వెల్లడించారు. ఈ ఘటనలో బంగారం, వెండి నగలు 50 తులాల.. నగదు లక్ష రూపాయలు అపహరించుకు వెళ్లినట్టు బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు : అమరావతి ఎక్స్ ప్రెస్​కు ప్రమాదం తప్పింది. ధర్మవరంలో కదిరి గేట్‌ వద్ద పట్టాలపై గుర్తు తెలియని దుండగులు రాళ్లు ఉంచారు. పట్టాలపై ఉంచిన రాళ్ల పైనుంచే ట్రైన్ వెళ్లడంతో ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. ఉహించని ఈ పరిణామంతో.. అమరావతి ఎక్స్‌ప్రెస్‌ ను గంటపాటు నిలిపేశారు. అనంతరం మరో ఇంజిన్‌ జోడించిన తర్వాత బయలుదేరింది.

ఇదీ చదవండి: Oilmill Owner Suicide: విజిలెన్స్ అధికారుల వేధింపులు.. కడపలో నూనె మిల్లు యజమాని ఆత్మహత్య

Last Updated : Apr 1, 2022, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.