several accidents in visakapatnam: నూతన సంవత్సరం పలువురి కుటుంబాలలో విషాదం నింపింది. విశాఖలో నిన్న జరిగిన నాలుగు రోడ్డు ప్రమాదాలలో ముగ్గురు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. మరో ఘటనలో చనిపోయిన బాలుడికి వైద్యం చేసి లక్షలు వసూలు చేశారంటూ తల్లిదండ్రులు బాలుడి మృతదేహంతో ఆందోళనకు దిగిన ఘటన కూడా శనివారం రాత్రి చోటుచేసుకుంది. హనుమంతవాక కూడలిలో శనివారం రాత్రి బైక్ పై వెళ్తున్న వారిని వేగంగా వెళుతున్న లారీ బలంగా ఢీకొనడంతో....లారీ కింద పడి మహిళ మరణించగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి హుటాహుటిన పోలీసులు స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు.
మరో ఘటన లంకెలపాలెం జాతీయరహదారి పై చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా గవరపాలెంకు చెందిన హిమకర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దువ్వాడ విజ్ఞాన్ కళాశాలలో బీటెక్ చదువుతున్న పొలిమేర హిమకర్ తన స్వగృహానికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
మరొక ఘటనలో నూతన సంవత్సర వేడుకలు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో వేగంగా వాహనాన్ని నడిపి రైల్వే ఆస్పత్రి సమీపంలోని గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా కారు నుజ్జునుజ్జయింది. వెంటనే స్పందించిన తోటి వాహనదారులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.
అలాగే మరొక ఘటనలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో ఆగి ఉన్న లారీని ఆల్టో కారు ఢీకొన్న ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా చనిపోయిన వ్యక్తి భీమవరానికి చెందిన బొడ్డు సందీప్ గా గుర్తించారు. సందీప్ ఓలా ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాడు. సందీప్(23) వృత్తిపనిగా విశాఖలోని వడ్లపూడిలో నివసిస్తున్నాడు.
ఇవే కాకుండా నిన్న రాత్రి జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలయ్యాయి. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. నూతన సంవత్సరం ఎన్నో ఆశలతో, ఎంతో సంతోషంతో గడపాల్సిన వీరి కుటుంబాలు.. శోక సంద్రంతో కేజీహెచ్ మార్చురీ వద్ద పడిగాపులు కాస్తున్నారు.
ఇవీ చదవండి: