తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్ వద్ద విషాదం చోటు చేసుకుంది. అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద గేటు తగిలి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. లాక్‌డౌన్ వేళ అధికారులు ఆపుతారనే భయంతో వేగంగా వెళ్లిన యువకుడు అతని మిత్రుడి మృతికి కారణమయ్యాడు.
వాహనం దూరంగా ఉన్నప్పుడే అటవీ అధికారి వాహనాన్ని ఆపమని సిగ్నల్ ఇస్తూనే ఉన్నాడు. అదేమీ పట్టించుకోకుండా వేగంగా వచ్చిన వాహనదారుడు గేటు కింది నుంచి బైకును పోనిచ్చాడు. ఈ క్రమంలో ఆ వాహనదారుడు బయటపడగా... వెనకున్న వ్యక్తి మాత్రం గేటుకు బలంగా ఢీకొని కిందపడిపోయాడు. ఆ అధికారి ఎంత ప్రయత్నించినా కుప్పకూలిన ఆ యువకుడి విలువైన ప్రాణం కాపాడలేకపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి.
ఇదీ చూడండి: లైవ్ వీడియో: బద్ధలైన అగ్నిపర్వతం