ETV Bharat / crime

STUDENT SUISIDE: ఫోన్​ ఎక్కువగా చూడొద్దన్నందుకు.. విద్యార్థిని అఘాయిత్యం - తెలంగాణ నేర వార్తలు

ఫోన్​ ఎక్కువగా చూడొద్దని తల్లి మందలించినందుకు.. మనస్థాపానికి గురైన పదోతగరతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో జరిగింది.

తల్లి మందలింపుతో పదోతగరతి విద్యార్థిని ఆత్మహత్య

author img

By

Published : Aug 29, 2021, 3:23 PM IST

తెలంగాణ రాష్ట్రం నల్గొండకు చెందిన పదోతరగతి విద్యార్థిని కావ్య ఆత్మహత్య చేసుకుంది. ఫోన్​ ఎక్కువగా వాడుతుందని తల్లి మందలించడంపై మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. లాక్​డౌన్​ కారణంగా పాఠశాలలు లేకపోవడం వల్ల ఇంట్లోనే ఉన్న కావ్య.. ఈ మధ్యకాలంలో ఫోన్​ ఎక్కువగా చూస్తోందని తల్లి మందలించింది. మనస్థాపం చెందిన కావ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

కుటుంబసభ్యులు హుటాహుటిన నల్గొండ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. వెంటనే హైదరాబాద్ లోని ఎల్బీనగర్​లో ఓ ప్రైవేటు​ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ.. ఆరోగ్యం విషమించిన కారణంగా.. కావ్య నిన్న రాత్రి 12 గంటల సమయంలో మృతి చెందింది.

వైద్యుల నిర్లక్షంతోనే..

వైద్యుల నిర్లక్షంతోనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. చికిత్స కోసం రూ.3 లక్షలు తీసుకున్నారని.. అయినా సరైన చికిత్స అందించలేదని.. ప్రాణాలు నిలబెడతారనుకుంటే ప్రాణం తీశారని ఆరోపించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఫోన్​ ఎక్కువగా వాడుతోందని ఆమె తల్లి మందలించిందని పురుగులమందు తాగింది. వెంటనే నల్గొండలోని ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడి వైద్యులు హైదరాబాద్​ తీసుకెళ్లమన్నారు. శనివారం మధ్యాహ్నం 3.30కు ఎల్బీనగర్​లోని ఆస్పత్రిలో చేర్పించాం. వెంటనే రూ.1.50లక్షలు కట్టించుకున్నారు. బిడ్డ బతికే అవకాశం ఉందని చెప్పారు. తర్వాత మరో రూ.1.50లక్షలు చెల్లించమన్నారు. రాత్రికి రాత్రే ఆ డబ్బును తీసుకొచ్చాం. అప్పటివరకు బతికే ఉందని చెప్పి.. అనుమానమొచ్చి ప్రశ్నిస్తే.. రాత్రి 12 గంటల సమయంలో పాప మృతి చెందిందని చెప్పారు. -మృతురాలి బంధువు

ఇదీ చూడండి:

Suicide:విజయనగరం పీటీసీలో ఎస్ఐ భవానీ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.