ETV Bharat / crime

షాపు యజమాని నిర్లక్ష్యం.. వాటర్​ బాటిల్​ బదులు యాసిడ్‌.. తాగిన విద్యార్థి - విజయవాడ తాజా వార్తలు

student drunk acid
దాహంతో బాటిల్‌లోని యాసిడ్‌ తాగిన విద్యార్థి చైతన్య
author img

By

Published : Apr 17, 2022, 10:20 AM IST

Updated : Apr 17, 2022, 11:35 AM IST

10:16 April 17

విద్యార్థి పరిస్థితి విషమం

విజయవాడలోని ఎనికెపాడులో దారుణం జరిగింది. ఓ యువకుడికి దాహంగా ఉందని.. వాటర్ బాటిల్ కోసం షాపు దగ్గరికి వెళ్లాడు. కొట్టు యజమాని నిర్లక్ష్యంతో వాటర్‌ బాటిల్‌ బదులు యాసిడ్‌ బాటిల్‌ ఇచ్చాడు. దాహంతో బాటిల్‌లోని యాసిడ్​ను మంచినీళ్లు అనుకొని చైతన్య తాగాడు. యాసిడ్‌ తాగడంతో చైతన్య తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. దీంతో చైతన్య పరిస్థితి విషమంగా ఉంది. చైతన్య లయోలా కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. చైతన్య వైద్యానికి కళాశాల యాజమాన్యం విరాళాలు సేకరిస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ చదవండి: మంగళగిరిలో అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్​ వ్యర్థాల గోదాము దగ్ధం

Last Updated : Apr 17, 2022, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.