son murdered mother: మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని కన్న తల్లిని.. కుమారుడే హతమార్చిన ఘటన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నర్సింపల్లిలో జరిగింది. మద్యానికి బానిసైన కుమారుడు.. డబ్బుల కోసం 75 ఏళ్ల వృద్ధురాలిని తరచూ ఇబ్బంది పెట్టేవాడు.
ఇదే క్రమంలో మద్యం తాగి వచ్చి.. డబ్బులు కావాలంటూ వృద్ధురాలిని అడిగాడు. డబ్బులు లేవని చెప్పడంతో ఆగ్రహించిన కుమారుడు నారాయణ.. బండరాయితో తలపై కొట్టాడు. గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. పెద్ద కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
Pigeon Viral: నెల్లూరులో తెల్ల పావురం కలకలం... భయాందోళనలో స్థానికులు