ETV Bharat / crime

SI BHAVANI SUICIDE CASE: ఈ రోజు చనిపోతున్నా.. ముందుగానే రాసిపెట్టిన మహిళా ఎస్‌ఐ

విజయనగరం జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళా ఎస్​ఐ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్​ఐ భవాని వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్య చేసుకుందని... బలవన్మరణానికి పాల్పడబోయేకంటే ముందే 'ఈ రోజు చనిపోతున్నానంటూ' ఓ పుస్తకంలో రాసిపెట్టిందని పోలీసులు వివరించారు.

si-bhavani-suicide-note-found-by-police
ఈ రోజు చనిపోతున్నా.. ముందుగానే రాసిపెట్టిన మహిళా ఎస్‌ఐ
author img

By

Published : Aug 31, 2021, 10:12 AM IST

విజయనగరం జిల్లాలో సంచలనం రేకెత్తించిన సఖినేటిపల్లి మహిళా ఎస్‌ఐ కె.భవాని వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఆమె గదిలో, ఫోన్‌లో ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. పీటీసీలో ఆమె బస చేసిన గదిలోని ఓ పుస్తకంలో మాత్రం ‘ఈ రోజు చనిపోతున్నా’ అని రాసి ఉందని, దాన్ని స్వాధీనం చేసుకున్నామని ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు.

ఫ్యాన్​కు ఉరివేసుకొని వేలాడుతూ...

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి ఎస్‌ఐ కె.భవాని (27) నేర విశ్లేషణ (సీడీ) శిక్షణ కోసం 5 రోజుల క్రితం జిల్లాకు వచ్చారు. నగరంలోని పోలీసు శిక్షణ కళాశాలలోని (పీటీసీ) క్వార్టర్స్‌లో ఉన్నారు. శనివారం మధ్యాహ్నం శిక్షణ ముగియడంతో తన గదికి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన పనివారు తలుపు కొట్టినా తీయకపోవడంతో కిటికీ తెరచి చూశారు. భవాని ఉరేసుకుని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో...వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌, డీఎస్పీ పి.అనిల్‌ కుమార్‌ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

శనివారమే శిక్షణ ముగిసినా...

శనివారమే శిక్షణ పూర్తయినప్పటికీ... భవాని అక్కడే ఉండిపోయారు. ఉదయం వెళతానని అధికారులకు చెప్పినట్లు తెలిసింది. కానీ తెల్లారేసరికి ఆమె ఫ్యాన్​కి ఉరివేసుకొని చనిపోయారు. చనిపోవాలని నిర్ణయం తీసుకుంది కాబట్టే... శిక్షణ ముగిసినా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోవడానికి ముందుగానే ‘ఈ రోజు చనిపోతున్నా’ అని ఓ పుస్తకంలో రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది.

ఇదీ చూడండి: suicide:విజయనగరం పీటీసీలో ఎస్ఐ భవానీ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.