తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. గోదావరి నదిలో నీటమునిగి ఆరుగురు మృతి చెందారు. ఓ బాలుడిని స్థానికులు కాపాడారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ వద్ద వీఐపీ పుష్కరఘాట్ వద్ద ఘటన జరిగింది.
తెప్ప దీపం సమర్పించేందుకొచ్చి..
నిజామాబాద్ నగరం, మాక్లూర్, నందిపేట్ మండలాలకు చెందిన బంధువులు కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి నదిలో తెప్ప దీపం సమర్పించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పిల్లలు నదిలో జారిపడగా.. కాపాడబోయిన పెద్దలు గల్లంతయ్యారు. మొత్తం ఏడుగురు గల్లంతు కాగా.. ఓ బాలుడిని స్థానికులు కాపాడారు. చనిపోయిన ఆరుగురిలో ముగ్గురు బాలురు ఉన్నారు.
మృతుల వివరాలు
నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్టకు చెందిన బొబ్బిలి శ్రీనివాస్ (40), అతడి కుమారులు శ్రీకర్(14), సిద్ధార్థ్(16), మాక్లూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన రాజు (24), నందిపేట్ మండలం డీకంపల్లికి చెందిన తండ్రి కుమారుడు సురేష్(40), యోగేష్(16). మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి