ETV Bharat / crime

Red Sandal Seized: శేషాచలం అడవుల్లో కూంబింగ్​.. ముగ్గురు తమిళ స్మగ్లర్లు అరెస్ట్ - ఎర్రచందనం స్మగ్లర్లు

Redsandal Seized in Chittoor: చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో టాస్క్​ఫోర్స్ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్లతో పాటు ఇద్దరు స్థానిక వేటగాళ్లను అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి రెండు నాటు తుపాకులతో పాటు.. మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Redsandal Seized in Chittoor
Redsandal Seized in Chittoor
author img

By

Published : Feb 25, 2022, 9:20 AM IST

Redsandal Seized in Chittoor: చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో టాస్క్​ఫోర్స్ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. చిన్నగొట్టిగల్లు, యర్రావారిపాళ్యం సమీపంలోని అడవుల్లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్లతో పాటు ఇద్దరు స్థానిక వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. భాకరాపేట పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు అటవీ సమీప ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేవరకొండ పంచాయతీ మైలావాళ్లపల్లి రిజర్వు అటవీ ప్రాంతంలో ఇద్దరు వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. శేషాచల అడవుల్లో జంతువులను వేటాడి మాంసాన్ని సమీప ప్రాంతాల్లో అమ్ముతున్నట్లుగా పోలీసుల విచారణలో పేర్కొన్నారు. వారి నుంచి రెండు నాటు తుపాకులతో పాటు.. మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరు ఎర్రావారిపాలెం మండలానికి చెందిన చిన్నయ్య, ఎర్రయ్యలుగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ముగ్గురు తమిళ స్మగ్లర్లు అరెస్ట్..
ఎర్రవారిపాలెం మండలంలోని కొంగరవారిపల్లి సమీపంలో గల అటవీ ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పీలేరు రూరల్ పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు స్థానిక సీఐ తెలిపారు. అటవీ సమీప ప్రాంతాలలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల సమాచారం తమకు అందజేయాలని పోలీసులు కోరారు. నిరంతరం తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

Murder: దారుణం... పందులు దొంగలిస్తున్నాడని ప్రాణం తీశారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.