ACCIDENT : విజయవాడలోని జాతీయ రహదారిపై రామవరప్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుడి తీవ్రగాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న బైక్‌ని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యప్తు ప్రాంభించారు.
ఆటో-కారు ఢీ : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం వద్ద ఆటోను కారు ఢీ కొట్టడంతో.. ఐదుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. విజయవాడ నుంచి సచివాలయం వైపు వెళ్తున్న కారు.. ఆటోను బలంగా ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను తుళ్లూరు ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచరమందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
వాహనం బోల్తా : వైఎస్సార్ జిల్లా భాగ్యనగరం వద్ద మాంసం తరలిస్తున్న గూడ్స్ వాహనం బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వాహనంలో ఇరుక్కుపోయి.. మూడు గంటలపాటు నరకం చూశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు జేసీబీని సాయంతో గాయపడిన వారిని సురక్షితంగా బయటకు తీశారు.
ఇవీ చదవండి: