ETV Bharat / crime

Video Viral: రైతుల నుంచి లంచం తీసుకుంటున్న రెవెన్యూ అధికారి!

అనంతపురం జిల్లాలో ఓ రెవెన్యూ అధికారి లంచం తీసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కూడేరు రెవెన్యూ కార్యాలయం పరిధిలో రైతుల భూములకు సంబంధించి అన్​లైన్​లో పేర్లు నమోదు చేయడానికి ఆర్.ఐ శివారెడ్డి రూ. 10వేలు డిమాండ్ చేసి కెమెరాకు చిక్కారు.

revenue officer corruption video viral
ఆర్​ఐ అవినీతి బాగోతం
author img

By

Published : Aug 21, 2021, 11:01 PM IST

కూడేరు రెవెన్యూ కార్యాలయంలో అవినీతి బాగోతం

అనంతపురం జిల్లా కూడేరు రెవెన్యూ కార్యాలయంలో ఓ అధికారి లంచం తీసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్​ అయింది. అవినీతి ఆరోపణలతో గతంలో అదే కార్యాలయంలోని ఐదుగురు అధికారులు సస్పెండ్ అయినా ప్రస్తుతం ఉన్న అధికారుల్లో ఎలాంటి మార్పు లేదనేందుకు ఈ వీడియో ఉదాహరణగా నిలుస్తోంది. తాజాగా.. ఆర్.ఐ శివారెడ్డి.. రైతుల నుంచి లంచం తీసుకుంటున్న ఆన్​లైన్​లో చక్కర్లు కొడుతుంది.

ఆరవకూరు, కమ్మూరు రైతులకు సంబంధించి అన్​లైన్​లో పేర్లు నమోదు చేయడానికి ఆర్.ఐ శివారెడ్డి రూ. 10వేలు లంచం డిమాండ్ చేశాడు. అయితే రైతు లంచం ఇస్తూ ఫోన్​లో రికార్డు చేయడంతో ఆ అధికారి అవినీతి బండారం బయటపడింది. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు సదరు వీడియోపై స్పందించారు. విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనతో కూడేరు తహసీల్దార్ కార్యాలయం.. జిల్లాలోనే అవినీతికి మారుపేరుగా గుర్తింపు పొందింది. గతంలో కూడేరులో కొండ, గుట్టలకు పాసుపుస్తకాలు మంజూరు చేసిన వ్యవహారంలో తహసీల్దార్​తోపాటు ఐదుగురు వీఆర్వోలను అప్పటి కలెక్టర్ సస్పెండ్ చేశారు. అయితే వారి స్థానంలో కొత్తగా వచ్చిన సిబ్బంది సైతం అదే పద్దతిలో డబ్బలు వసూలు చేస్తూ.. రైతులను పీడిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఇదీ చదవండి:

వృద్ధుడే.. ఆయన చేసే పని తెలిస్తే.. షాక్ అవుతారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.