ETV Bharat / crime

Tollywood drugs case:నేటి విచారణకు రవితేజ...లావాదేవీలపై ప్రత్యేక దృష్టి - హీరో రవితేజా వార్తలు

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు(Tollywood drugs case)లో ఈడీ (enforcement directorate) దర్యాప్తు కొనసాగుతోంది. నోటీసుల జారీ చేసిన ఒక్కొక్కరూ విచారణకు హాజరు హాజరుకావడం... వారితో పాటు ఎక్సైజ్ కేసు(excise case)లో ప్రధాన నిందితుడుగా ఉన్న కెల్విన్(KELVIN)​ను కలిపి విచారిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అతని వద్ద సేకరించిన వివరాలతో ఒక్కొక్కరిని సుధీర్ఘంగా విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురిని విచారించిన ఈడీ అధికారులు నేడు నటుడు రవితేజ(HERO RAVI TEJA)తోపాటు అతని డ్రైవర్‌ శ్రీనివాస్‌ కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన గతంలోనే వీరికి ఈడీ అధికారులు నోటిసులు జారీ చేశారు.

RAVI TEJA
రవితేజ
author img

By

Published : Sep 9, 2021, 4:12 AM IST

సినీ తారల డ్రగ్స్ కేసు(Tollywood drugs case) వ్యవహారంలో ఈడీ విచారణ ఆసక్తికరంగా మారుతోంది. మానీలాండరింగ్‌(money laundering)కు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ 12మందికి నోటీసులు జారీ చేయగా విచారణకు ఒక్కొక్కరు హాజరవుతున్నారు. పూరి జగన్నాథ్‌, ఛార్మి, రకుల్ ప్రీత్‌ సింగ్‌, నందును విచారించిన ఈడీ అధికారులు నిన్న దగ్గుబాటి రానాను కూడా సుధీర్ఘంగా విచారించారు. ఏడు గంటలకు పైగా సాగిన విచారణలో అతని బ్యాంకు వివరాలు, యూపీఐ ట్రాన్సాక్షన్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మత్తుమందు సరఫరాదారు కెల్విన్ వద్ద సేకరించిన బ్యాంకు లావాదేవీలతో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే గతంలో ప్రత్యేకంగా ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(enforcement directorate) విచారణలో రకుల్‌ప్రీత్‌సింగ్, రానా పేర్లు బయటకు రాలేదు. అయితే ఇప్పుడు ఈడీ చేపట్టిన దర్యాప్తులో భాగంగా వారికి నోటీసులు జారీ చేసి విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గతంలో సేకరించిన లావాదేవీలకు, వారికి మధ్య..

మొన్న నటుడు నందును విచారిస్తున్న క్రమంలో కెల్విన్​ను అదుపులోకి తీసుకుని విచారించడం, నిన్న రానాతోపాటు కెల్విన్‌ కూడా విచారణకు హాజరుకావడం వెనుక ఏమి జరిగిందో తెలియాల్సి ఉంది. మరోవైపు కెల్విన్ స్నేహితుడు వాహిద్ కూడా వరుసగా రెండు రోజులుగా విచారణకు హాజరవుతున్నాడు. మొదట నోటీసులు జారీ చేసిన వారిని విచారించి మధ్యలో కెల్విన్‌, వాహిద్‌ను పిలిచి ఈడీ అధికారులు విచారిస్తున్నారు. వారి నుంచి గతంలో సేకరించిన లావాదేవీలకు, విచారిస్తున్న వారికి మధ్య.. ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా అనే కోణంలో ముందుకు సాగుతున్నారు. కొన్ని అనుమానస్పద లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

నేటి విచారణకు రవితేజ, డ్రైవర్ శ్రీనివాస్..

మరో వైపు హీరో రవితేజ, అతని డ్రైవర్ శ్రీనివాస్ నేడు విచారణకు హాజరుకానున్నారు. డ్రగ్స్‌ కేసులో రవితేజ డ్రైవర్‌పై తీవ్ర అరోపణలు రావడం ప్రస్తుతం అతన్ని కూడా ఈడీ ప్రత్యేక దృష్టిపెట్టి విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది. కెల్విన్‌ నుంచి డ్రైవర్ శ్రీనివాస్​కు మాదకద్రవ్యాలు సరఫరా అయ్యాయని ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు.. డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరిగాయి అనే దానిపై విచారణాధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై రవితేజ, శ్రీనివాస్‌ను విచారించే అవకాశం ఉంది. అయితే కెల్విన్ తెచ్చిన మత్తుమందులను వాహిద్‌ సరఫరా చేసి అతని బ్యాంకు ద్వారానే లావాదేవీలు జరిపేవాడని ఈడీ దృష్టికి వచ్చింది. దీంతో నేడు కెల్విన్ సహా వాహిద్‌ను కూడా వీరితోపాటు విచారణకు పిలిచే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు:

TOLLYWOOD DRUGS CASE: రానా ఈడీ విచారణ.. కెల్విన్​తో లావాదేవీలపై ఆరా

Tollywood Drugs Case: 6 గంటలపాటు నటి రకుల్​ప్రీత్ సింగ్​ విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.