Rape On Minor Girl: విజయవాడలోని కొత్తపేటలో దారుణం జరిగింది. పని చేసేందుకు ఇంటికి వచ్చిన బాలికపై యజమాని అత్యాచారానికి ఒడిగట్టాడు. కొత్తపేటకు చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు చనిపోగా... పెద్దమ్మ పెదనాన్న వద్ద ఉంటోంది. 7వ తరగతి చదువుతున్న ఈ బాలిక... కొత్తపేటలో ఉంటున్న రాజు అనే వ్యక్తి ఇంటికి పని నిమిత్తం సోదరుడితో కలిసి రెండు వారాలు క్రితం వెళ్లింది.
పని చేసేందుకు ఇంటికి వచ్చిన బాలికను... రాజు తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో వారు...మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
వెంకటగిరిలో ప్రేమోన్మాది ఘాతుకం... ప్రేమించలేదని యువతి గొంతు కోసి..