పదో తగరతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఫిలింనగర్ ప్రాంతంలో నివసించే ఓ పదో తరగతి విద్యార్థిని(15) చరవాణిలో చాటింగ్ చేస్తూ ఏడుస్తూ ఉండటాన్ని తండ్రి గమనించాడు. విచారించగా.. మూడు నెలలుగా ఇంటి సమీపంలో నివసించే మహేశ్ అలియాస్ కృష్ణ చైతన్య(20) తనను 'ప్రేమించాను.. పెళ్లి చేసుకుంటాను' అని నమ్మించాడంటూ తండ్రికి తెలిపింది.
ఈ క్రమంలోనే గత నెల 19న మహేశ్ తనను తన సోదరి ఇంటికి తీసుకెళ్లాడని పేర్కొంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రానని చెప్పానని.. అయినప్పటికీ బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడని, భయపడి పెదవి విప్పలేదని ఆమె తెలిపింది. ఈ మేరకు విద్యార్థిని తండ్రి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: