ETV Bharat / crime

కంటైనర్ నుంచి సెల్​ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చోరీ కేసు.. పోలీసుల అదుపులో నిందితులు

Police Solve The Cell Phones And Laptops Theft Case : సెల్‌ఫోన్లు తరలిస్తున్న కంటైనర్‌ నుంచి కోట్లు విలువ చేసే మొబైల్‌ ఫోన్లు దొంగలిచ్చిన అంతర్రాష్ట్ర ముఠాను కడప పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.68 కోట్ల రూపాయల విలువ చేసే మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌ టాప్‌లు, రెండు కార్లు స్వాధీనం..

Police Solve The Cell Phones And Laptops Theft Case

author img

By

Published : Nov 9, 2022, 9:13 AM IST

కంటైనర్ నుంచి సెల్​ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చోరీ కేసు.. పోలీసుల అదుపులో నిందితులు

Police Solve The Cell Phones And Laptops Theft Case : హరియాణా నుంచి చెన్నైకి సెల్‌ఫోన్లు తరలిస్తున్న కంటైనర్‌ నుంచి కోట్లు విలువ చేసే మొబైల్‌ ఫోన్లు దొంగలిచ్చిన అంతర్రాష్ట్ర ముఠాను కడప పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 23న కడప శివారులో కంటైనర్‌ను ఆపి డ్రైవర్ల సాయంతో మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఎత్తుకెళ్లారు. కడప చిన్నచౌక్‌ స్టేషన్‌లో బ్లూడాట్‌ కొరియర్‌ సంస్థ ఫిర్యాదు ఇవ్వగా... 4 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేసి దొంగలను పట్టుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. నిందితుల నుంచి 1 కోటి 58 లక్షల రూపాయల విలువ చేసే మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌ టాప్‌లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ జరిగింది : Cell phones and laptops theft from container: హరియాణాకు చెందిన కంటైనర్​లో చోరీ జరిగింది. సుమారు కోటి రూపాయలు విలువచేసే సెల్​ఫోన్లు, ల్యాప్​ట్యాప్​లు ఆ కంటైనర్​లో ఉన్నట్లు తెలిసింది. దాదాపు పది రోజులు క్రిందట ముంబై నుంచి చెన్నైకి కంటైనర్ బయలుదేరింది. కంటైనర్​లో ఉన్నసామాగ్రిని కంటైనర్ డ్రైవరే చోరీకి పాల్పడినట్లు తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

హరియాణాకు చెందిన డ్రైవర్ దిల్లీ నుంచి హైదరాబాదుకు.. అక్కడ నుంచి కడపకు వచ్చి మార్గమధ్యంలో కంటైనర్​లో ఉన్న సెల్​ఫోన్లు, ల్యాప్​ట్యాప్​లు చోరీ అయ్యాయని.. వాహనాన్ని కడప రింగురోడ్డు వద్ద వదిలి వెళ్లిపోయారని కడప పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కంటైనర్ డ్రైవరే చోరీకి పాల్పడినట్లు తేలిందన్నారు. డ్రైవర్​తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.