ETV Bharat / crime

ప్రొద్దుటూరులో 3 కిలోల బంగారం, రూ.7 లక్షలు పట్టివేత - latest crime news in kadapa district

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ వ్యక్తి వద్ద నుంచి భారీ ఎత్తున బంగారం, వెండి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ కోటిన్నర ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ప్రొద్దుటూరులో బంగారం, నగదు పట్టివేత
police seized gold and cash at proddatur
author img

By

Published : Feb 3, 2021, 4:14 AM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ ఎత్తున బంగారం, వెండి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని సినీహబ్‌ దగ్గర ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో గ్రామీణ పోలీసు స్టేషన్‌ ఎస్సై లక్ష్మీనారాయణ అతడిని తనిఖీ చేశారు. ఎలాంటి బిల్లులులేని సుమారు 2.9 కిలోల బంగారంతో పాటు, రూ.7లక్షలు నగదును గుర్తించారు. బంగారం విలువ కోటిన్నర ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. బంగారంతో ఉన్న వ్యక్తి హైదరాబాద్ వాసిగా పోలీసులు గుర్తించారు.

కొత్తపల్లి చెక్ పోస్టు వద్ద తనిఖీలు..

కడపకు చెందిన మరో వ్యక్తి వద్ద కొత్తపల్లి చెక్‌పోస్టు దగ్గర పోలీసులు తనిఖీ చేశారు. ఎలాంటి బిల్లులు లేని 5 కిలోల వెండి, రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం, వెండి బయటపడటంతో పోలీసులు వారిని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి

తెదేపా నేత పట్టాభిపై దాడి.. అసలేం జరిగింది..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.