ETV Bharat / crime

Honor Killing: తెలంగాణలో మరో పరువు హత్య.. సుపారి ఎంతంటే! - Defamation assassination scandal

Honor Killing: తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరిలో పరువు హత్య కలకలం రేపింది. పట్టణంలో శుక్రవారం అదృశ్యమైన స్థిరాస్తి వ్యాపారి రామకృష్ణ.. విగతజీవిగా బయటపడ్డాడు. కుమార్తె ఇష్టం లేని వివాహం చేసుకుందనే కోపం, ఆస్తిలో వాటా అడుగుతున్నారనే కక్షతో యువతి తండ్రే సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు.

honor killing
తెలంగాణలో మరో పరువు హత్య.. సుపారి ఎంతంటే!
author img

By

Published : Apr 18, 2022, 7:16 AM IST

తెలంగాణలో మరో పరువు హత్య.. సుపారి ఎంతంటే!

Honor Killing: తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో పరువు హత్య కలకలం సృష్టించింది. పట్టణంలో శుక్రవారం అదృశ్యమైన ఎరుకుల రామకృష్ణ (32) అనే యువకుడు విగతజీవిగా మారారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం శివారు పెద్దమ్మతల్లి దేవాలయం సమీపాన నిర్మాణంలో ఉన్న రైల్వే లైను పునాదిలో అతడి మృతదేహం లభ్యమైంది. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడనే కక్షతో రామకృష్ణను అతడి మామ వెంకటేష్‌ సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుని భార్య భార్గవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమృతయ్య అనే వ్యక్తిని విచారించగా కుట్ర మొత్తం బయటికొచ్చింది. ఈ హత్యోదంతాన్ని భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి, పట్టణ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ ఆదివారం రాత్రి విలేకరులకు వివరించారు. ఆ వివరాల ప్రకారం..

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లికి చెందిన ఎరుకుల రామకృష్ణ పదేళ్ల క్రితం హోంగార్డుగా విధుల్లో చేరారు. మొదట్లో వలిగొండలో పనిచేసి, తర్వాత యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లికి చెందిన పల్లెపాటి వెంకటేష్‌ వీఆర్వోగా పనిచేస్తూ మండల కేంద్రంలో నివసిస్తున్నారు. అతడి ఇంటి పక్కనే నివసించే రామకృష్ణకు వెంకటేష్‌ కుమార్తె భార్గవితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్ల కిందట వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలల కిందట భార్గవి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వీరు పది నెలల కిందట భువనగిరికి మకాం మార్చారు. అయితే వీరి పెళ్లి నచ్చకపోవడంతో అల్లుడిపై కక్ష పెంచుకున్న వెంకటేష్‌ పెళ్లయిన కొత్తలోనే రామకృష్ణను మట్టుబెట్టేందుకు ప్రయత్నించాడు. తన ఆస్తిలో వాటా కోసం కోర్టులో కేసు వేస్తానని కుమార్తె ఇటీవల అంటుండడంతో అల్లుడిని హత్య చేయించాడు.

2020 ఆగస్టులో ప్రేమ వివాహం..

.

నల్గొండ జిల్లా చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద 2020 ఆగస్టులో భార్గవిని రామకృష్ణ వివాహం చేసుకున్నాడు. అనంతరం దంపతులు కొద్ది నెలల పాటు సొంతూరు లింగరాజుపల్లిలో, కొన్నాళ్లు నల్గొండలో నివసించారు. అక్కడ ఉంటున్న సమయంలో భార్గవిని ఆమె తండ్రి వెంకటేష్‌ బలవంతంగా రెండుసార్లు తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు. రామకృష్ణను వదిలేసి వచ్చేయమని కుమార్తెను ఒత్తిడి చేశాడు. అయినా ఆమె వినకుండా, తిరిగి తన భర్త వద్దకే వెళ్లిపోయింది. పది నెలలుగా భార్య, బిడ్డతో కలిసి భువనగిరిలోని తాతానగర్‌లో నివసిస్తున్న రామకృష్ణ స్థిరాస్తి వ్యాపారంలోకి దిగాడు.

హత్యకు కుట్ర ఇలా...

బీబీ నగర్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న యాదగిరి, వలిగొండ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రామారావుతో కలిసి వ్యూహం రూపొందించాడు. ఈ నెల 15న జమ్మాపూర్‌కు చెందిన అమృతయ్యతో కలిసి తన భర్త రామకృష్ణ భువనగిరిలోని తన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని భార్గవి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఈ నెల 16న ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అమృతయ్యను విచారించగా సిద్దిపేటకు చెందిన లతీఫ్‌ గ్యాంగ్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బయటపడిందని ఏసీపీ తెలిపారు. రామకృష్ణను హత్య చేసేందుకు రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న వెంకటేష్‌ రూ. 6 లక్షలు లతీఫ్‌కు ముట్టజెప్పాడు. అతడి ప్రణాళిక ప్రకారం... రామకృష్ణను అమృతయ్య గుండాల మండలంలోని నిమ్మతోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ వేచి ఉన్న హంతకులు తమ వద్ద సిద్ధంగా ఉంచుకున్న కల్లుగీత కత్తి, సుత్తితో రామకృష్ణను దారుణంగా కొట్టి హత్య చేశారని ఏసీపీ తెలిపారు.

హత్యలో పాల్గొన్న లతీఫ్‌, అతని భార్య దివ్య, అఫ్సర్‌, మహేశ్‌లు రామకృష్ణ మృతదేహాన్ని బస్తాలో మూటకట్టి కారులో సిద్దిపేటకు తరలించారు. ఆ రోజు రాత్రి కారును మృతదేహంతో సహా లతీఫ్‌ ఇంటి ముందు ఉంచారు. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు లకుడారం వద్ద పాతిపెట్టారు. అమృతయ్య ఇచ్చిన సమాచారం మేరకు లతీఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడని ఏసీపీ తెలిపారు. హత్యలో మొత్తం 11 మంది పాల్గొన్నారని వెల్లడించారు. లతీఫ్‌, దివ్య, అఫ్సర్‌, మహేశ్‌లను అదుపులోకి తీసుకున్నామని, మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
గుండెలవిసేలా..

రామకృష్ణ హత్య వార్త విని అతడి భార్య భార్గవి, తల్లి కళమ్మ, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. ‘మా నాన్న ఇంతటి ఘాతుకానికి పాల్పడతాడని అనుకోలేదు. నాకు, ఆరు నెలల నా బిడ్డకు తీవ్ర అన్యాయం చేశారు’ అంటూ భార్గవి రోదిస్తున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో గత అయిదేళ్లలో ఇది రెండో పరువు హత్య.

గుప్త నిధుల ఆరోపణలతో..

హోంగార్డుగా పనిచేస్తున్న రామకృష్ణ తన కుమార్తెతో నడుపుతున్న ప్రేమ వ్యవహారాన్ని మొదట్లోనే తెలుసుకొన్న వెంకటేష్‌ కులాలు వేరుకావడంతో వారిద్దరినీ మందలించాడు. అప్పటికే రామకృష్ణ చేస్తున్న పనుల గురించి తెలుసుకున్న వెంకటేష్‌ తుర్కపల్లి మండలం వెలుగుపల్లి గుప్తనిధుల కేసులో రామకృష్ణకు సంబంధం ఉందని పోలీసులకు చెప్పాడు. ఆ కేసు దర్యాప్తులో రామకృష్ణ నిందితుడిగా తేలడంతో 2020 జనవరిలో అతడిపై సస్పెన్షన్‌ వేటు పడింది.

ఇదీ చదవండి: రేపు విశాఖకు సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.